చేదు లేని ఆ కాకర తింటే ఆరోగ్యానికి ఎంతో మేలో తెలుసా ?

0
249

సీజన్‌కో కూరగాయ, పండ్లు వస్తుంటాయి. అవి ఆ సీజన్‌లో తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలాంటి సీజనల్ కూరగాయల్లో ఒకటి ఆకాకర… తెలంగాణలో బోడకాకర అని పిలుస్తుంటారు. కాకరకాయలలాగా ఉండే ఈ కాయలు… పొట్టిగా, గుండ్రంగా, చిన్నచిన్న ముళ్లు మాదిరి తోలుతో ఉంటాయి. పైగా ఇవి అస్సలు చేదుండవు. అందుకే, కాకరకాయలు తినని వారిని కూడా తినిపించేలా ఉంటాయివి. మామూలు కాకరకాయలని ఎన్నిరకాలుగా వండుకుంటామో అలాగే వీటినీ చేసుకోవచ్చు. కరకరాలాడే ఫ్రై చేసినా, పుల్లగా పులుసుపెట్టినా, మసాలా పెట్టి కూర వండినా.. టేస్టు అదిరిపోతుంది. టేస్ట్ తోపాటు ఇవి అందించే పోషకాలు కూడా అమోఘం. అయితే వీటిని వండేటప్పుడు పైనున్న బొడిపెలను తీసేయకుండా వండాలి.

Health Benefits of Boda Kakaraఅడవుల్లో ఎక్కువగా దొరికే ఆకాకర ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటంతోపాటు పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. తద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఇతర అలెర్జీలు దూరం అవుతాయి. వీటిలో ఉండే ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. గర్భిణులు రెండు పూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వల్ల దాదాపు వందగ్రాముల ఫొలేట్‌ అందుతుంది.

Health Benefits of Boda Kakaraసాధారణ కాకర తరహాలోనే ఆకాకర కూడా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులోని విటమిన్ -సి ఇన్ఫెక్షన్లతో పోరాడి క్యాన్సర్ల బారిన పడకుండా అడ్డుకుంటుంది.

Health Benefits of Boda Kakaraఆకాకర కాయలోని కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. వీటిలో సమృద్ధిగా లభించే ప్లవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.

Health Benefits of Boda Kakaraబోడ కాకర కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది. మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.

SHARE