జిల్లేడు గురించి ఎవ్వరికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలు

మారుతున్న కాలంతోపాటు మనుషుల ఆరోగ్యం విషయంలో కూడా పెనుమార్పులు వచ్చాయి. ప్రతి ఒక్కరూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా షుగర్ లేదా కీళ్ళు కాళ్ళనొప్పులతో బాధపడుతున్నవారు సంఖ్య ఎక్కువ. దానికి ఇంగ్లీషు మందులు వాడి మరిన్ని దుష్ప్రభావాలతో బాధపడడానికి ముందు ఈ ఆయుర్వేద చిట్కాలు ఒకసారి ప్రయత్నించి చూడండి. అదే జిల్లేడు. దీనిని వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది. జిల్లేడు మొక్కని ఆర్క లేదా మదర్ ప్లాంట్ అని కూడా అంటారు. జిల్లేడులో మూడు రకాల జాతులు ఉంటాయి. ఒకటి ఎర్ర జిల్లేడు, రాజజిల్లేడు, మరియు తెల్ల జిల్లేడు. జిల్లేడు చెట్టు నిండా పాలు ఉంటాయి. రోడ్లపక్కన, పొలంలో, పల్లెల్లో బీడుగావుండే అన్ని ప్రదేశాల్లో పెరుగుతుంది. ఇది చిన్న గుబురు మొక్క. ఆకులపైనా కొమ్మలపైనా తెల్లని బూడిద పొట్టు ఉంటుంది. ఈ మొక్క ఆయుర్వేద శాస్త్రంలో మెడిసన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు.

Health Benefits of Calotropisఈ సంప్రదాయ ఆరోగ్యప్రదాయనితో చక్కెర వ్యాధికి చెక్ పెట్టొచ్చు. అదీ రోజుకు రెండు ఆకులతోనే. పైగా, షుగర్ వ్యాధికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ రెండు జిల్లేడు ఆకులను తీసుకుని పాదాలకు తాకేలా పెట్టాలి. ఆకులను ముక్కలు ముక్కలుగా చేసి కూడా పాదాల కింద పెట్టుకోవాలి. ఈ ఆకులని షూ లేదా సాక్సులతో కప్పితే ఇంకా మంచిది. ఇలా రెండు కాళ్ల కింద పెట్టుకుని ఉదయం నుంచి సాయింత్రం వరకు ఉంచుకోవాలి. తర్వాత అవి తీసి పాదాలను బాగా శుభ్రం చేసుకోవాలి.

Health Benefits of Calotropisఇలా ఒకవారం పాటు చేయాలి. అయితే, ప్రతిసారీ కొత్త ఆకులనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా చేశాక ఓ వారం రోజుల తర్వాత బ్లడ్ షుగర్‌ని చెక్ చేసుకుంటే ఆశ్చర్యపోయే ఫలితం కనిపిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే కీళ్ళనొప్పులు ఉన్నవారు ఈ ఆకులకు గోరువెచ్చని ఆవనూనె లేదా నువ్వులనూనె రాసి నొప్పి ఉన్నచోట పరిశుభ్రంగా ఉన్న గుడ్డ సాయంతో కట్టడంవలన కీళ్ళు, కాళ్ళనొప్పులు తగ్గుతాయి. దీనికోసం రోజూ కొత్త ఆకులను ఉపయోగించాలి. మరియు తెల్లజిల్లేడు మాత్రమే ఉపయోగించాలి.

Health Benefits of Calotropisఈ పూవులను పదివరకూ తీసుకుని ఒకగ్లాసు నీటిలో వేసి మరగించాలి. అప్పుడు ఈ పూలలో ఉండే ఔషధగుణాలు ఆ నీటిలో చేరతాయి. తర్వాత పూవులను వేరుచేసి ఆ గోరువెచ్చని నీటిలో పాదాలను పది నిమిషాలు ఉంచాలి. తర్వాత ఉడికించిన పూలను గుడ్డతో నొప్పులు ఉన్నచోట కట్టడం వలన నొప్పులు తగ్గుతాయి. ఒక జిల్లేడు ఆకుని తీసుకుని ఆముదం లేదా నువ్వుల నూనె రాసి వేడిచేయాలి.ఆ తర్వాత ఆకును పాదాలు, కీళ్ళనొప్పులు ఉన్నచోట రాయాలి. జిల్లేడు చెట్టునుండి పాలను సేకరించి నొప్పి ఉన్నచోట ఈ పాలతో రెండు నుండి మూడునిమిషాలు మసాజ్ చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ పాలతో మోకాళ్ళ కు మసాజ్ చేసిన తర్వాత ఆకుకి నూనెరాసి వేసిచేసి మోకాలికి కట్టడం వలన పదినుండి పదిహేను రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నడుము నొప్పికి కూడా ఈ చిట్కాలు పనిచేస్తాయి.

Health Benefits of Calotropisఅంతేకాకుండా ఆయుర్వేద వైద్యంలో సిఫిలిస్, చెవిదిమ్మలువేయడం, శరీరంలో మంట (వాపు), మూర్ఛ, హిస్టీరియా, జ్వరం, కండరాల నొప్పులు, మొటిమలు, కుష్టు వ్యాధి, గౌట్ సమస్యలు, పాముకాటు మరియు క్యాన్సర్ చికిత్సకోసం ఈ తెల్లజిల్లెడు చెట్టును ఉపయోగిస్తారు. సెగగడ్డలు, వేడికురుపులు తగ్గడానికి ఈ ఆకులకు పసుపు కలిపి నూరి రాయాలి. అరికాళ్ళకు, అరిచేతులకు బొబ్బలు వస్తే ఈ చెట్టు పాలు రాయడంవలన తగ్గిపోతాయి. తెల్లజిల్లెడు వేరు బెరడును బోదకాలు చికిత్సలో వాడతారు. వేరు బెరడును నూరి కాలికి పట్టు వేస్తే ఎంతకాలంగా బాధపడుతున్న బోదకాలు కూడా తగ్గుతుంది.

Health Benefits of Calotropisజిల్లేడు పాలను తెగిన గాయాలపై రాస్తే రక్తస్రావం వెంటనే ఆగుతుంది. గజ్జల్లో బిల్లలు కడితే ఈ చెట్టు ఆకులకు ఆముదం రాసి వేడిచేసి కడితే బిల్లలు తగ్గుతాయి. ఈ చెట్టు బెరడును పొడి చేసి వాడితే ఆస్తమా, బోదకాలు, బ్రాంకైటీస్ చికిత్స కు వాడతారు. జిల్లేడు వేరుని కాల్చి పళ్ళు తోమడానికి వాడతారు. దీనివలన దంతసమస్యలు తగ్గిపోతాయి. పాముకాటు చికిత్స లో కూడా ఈ చెట్టుని ఉపయోగించేవారు. ఈ ఆకుల పేస్ట్ ని పాముకాటు పై రాసి కట్టుకడితే విషప్రభావం తగ్గుతుంది. జిల్లేడు వేరు బెరడుని నూరి నీటిలో కలపాలి.తర్వాత వడకట్టి ఆ నీటిని కొద్దికొద్దిగా తాగిస్తే పామువిషం విరుగుతుంది. జిల్లేడు ఆకు పొగపీల్చినా ఉబ్బసం తగ్గుతుంది.

Health Benefits of Calotropisజిల్లేడు పాలల్లో పసుపు కలిపి ముఖానికి రాస్తే ముఖంపై నల్లమచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా అందంగా మారుతుంది. లేత జిల్లేడు చిగుళ్ళను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ నాలుగు రోజులు ఉదయం ఒకటి, సాయంత్ర ఒకటి చొప్పున సేవిస్తే స్ర్తీల బహిష్టు నొప్పులు తగ్గుతాయి. అయితే జిల్లేడు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానినుండి వచ్చే పాలు చాలా ప్రమాదకరం. అవి కంట్లోపడితే చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR