కాలి ఫ్లవర్ ను రెగ్యులర్ గా తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ?

0
307

వంటకాల్లో తరచూ వండుకునే కాలీఫ్లవర్ లేదా గోబి పువ్వు గురించి మనందరికీ తెలుసు. ప్రస్తుతం మనకు కాలి ఫ్లవర్ మార్కెట్లో బాగా లభిస్తుంది. కాలి ఫ్లవర్ ను రెగ్యులర్ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కడుపుకు అనుకూలమైన వంటకాల్లో కాలీఫ్లవర్ ఒకటి. కాలీఫ్లవర్ కడుపు ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది.

cauliflowerకాలీఫ్లవర్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, వివిధ చర్మ వ్యాధులను నివారిస్తుంది, శరీరంలో మంటను తొలగిస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, హృదయ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది, ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాలీఫ్లవర్ బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.

Health Benefits Of cauliflowerకాలీఫ్లవర్ లో ఇండోల్-3 కర్బినల్ అనే స్టెరాల్ జీవ రసాయనం వుండటం ద్వారా.. క్యాన్సర్ కారకాలను నశింపజేస్తుంది. తద్వారా ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్లు దూరమవుతాయి. అలర్జీలు, జలుబును కూడా క్యాలీఫ్లవర్ నియంత్రిస్తుంది. హార్మోన్ల సమతౌల్యతకు క్యాలీఫ్లవర్ బాగా ఉపయోగపడుతుంది.

Health Benefits Of cauliflowerకంటి జబ్బులకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. డయాబెటిస్, పక్షవాతం, మెదడుకు సంబంధించిన వ్యాధులను దరిచేరనివ్వదు. గోబీలో కొలెస్ట్రాల్ దాదాపుగా ఉండదు కాబట్టి గుండెజబ్బులు ఉన్న వాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. అంతేగాకుండా అన్ని రకాల గుండెజబ్బులను ఇది నివారిస్తుంది.

Health Benefits Of cauliflowerకాలి ఫ్లవర్ బాడీలోని హీట్ ను తగ్గించేస్తుంది. కొందరు ఏదీ తిన్నా సరిగ్గా జీర్ణం కాదు. అజీర్తితో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారకు రోజూ కాలి ఫ్లవర్ తో తయారు చేసిన పదార్ధాలను తింటూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడతారు. కాలీఫ్లవర్ ఆహారంగానే కాదు దాని రసం తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

Health Benefits Of cauliflowerతాజా కాలీఫ్లవర్ రసాన్ని రోజూ ఒక గ్లాసు చొప్పున మూడు మాసాల పాటు త్రాగితే కడుపులోని కురుపులు తగ్గిపోతాయి, దంతాలు, చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గిపోతుంది. కాలీఫ్లవర్‌ ఆకుల రసం రోజూ ఒక కప్పు తాగితే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు వంటివి రావు. గర్భిణి స్త్రీలు ఈ రసం త్రాగితే పిండం ఆరోగ్యంగా పెరుగుతుంది. కాలేయం పనితీరును కూడా ఇది క్రమబద్ధం చేస్తుంది.

 

SHARE