లవంగం టీ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

మనం రోజూ వాడే మసాల దినుసులలో అతి ముఖ్యమైనది లవంగం. సాధారణంగా మన వంటల్లో వేసినప్పుడు, లవంగాలు వస్తే తినకుండా చాలామంది పడేస్తూ ఉంటారు. కానీ లవంగాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాలు వంటలకు మంచి వాసన, చక్కని రుచిని ఇవ్వడమే కాదు బరువు తగ్గడంలోనూ సహయపడుతుంది.

health benefits of clove teaప్రతిరోజు ఒక కప్పు లవంగం టీ తాగడం వల్ల, లేదా రాత్రి పడుకునే సమయంలో ఒకటి లవంగం నమిలి తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.ఇందులో శోథ నిరోధకాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను పెంచడానికి, ఇతర ఆరోగ్య వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. అసలు లవంగం టీ రోజూ తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..

లవంగం టీ తయారీ:

health benefits of clove teaముందు ఒక బాణాలిలో నీరు పోసి మరిగించాలి. నీరు వేడి అయిన తర్వాత వాటిని దించి కాస్తా చల్లార్చి అందులో సుమారు 4-5 లవంగాలు, తురిమిన అల్లం, దాల్చిన చెక్కలను అందులో కలపాలి. వాటిని నీటిలో సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచాలి. ఆ తర్వాత ఒక కప్పులోకి వడకట్టి ఒక టీస్పూన్ తేనే, ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. అంతే లవంగం టీ రెడీ.

లవంగం టీ తో ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ మసాలా టీ మీ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. లవంగం టీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఉండే సమ్మేళనం మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహయపడుతుంది. అలాగే జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలోని కొవ్వును బర్న్ చేస్తుంది.

health benefits of clove teaలవంగాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ను శుద్ధి చేసి, మన శరీరంలో మెటబాలిజం రేటును మెరుగుపరుస్తుంది. దీంతో మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె సమస్యల నుండి దూరం చేస్తుంది.

Health Benefits of Watermelon Seedsప్రతిరోజు ఉదయం కొద్దిగా లవంగాల పొడి తీసుకుని బాగా నీటిలో మరిగించి ఆ నీటిని వడబోసి, అందులో తేనె కలుపుకొని తాగడం వల్ల దంతాలు, చిగుళ్ల నొప్పులు తగ్గుతాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా లు నశించిపోయి, నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న లవంగాలను ప్రతి రోజు తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరిచేరవు.

health benefits of clove teaఅంతేకాకుండా చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఇది ముడతలు, వయసు మచ్చలు కనిపించకుండా చేస్తుంది. లవంగాలు ఫ్రీ రాడికల్ చర్యతో పోరాడటం ద్వారా, మీకు అందమైన చర్మాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి. మొటిమలు ఉన్నవారు లవంగాల టీని ఫేషియల్ వాష్‌గా ఉపయోగించుకుంటారు.

health benefits of clove teaలవంగాల షుగర్ వ్యాధిగ్రస్తుల పట్ల ఒక వరంగా భావించవచ్చు. లవంగాలలో ఉండే ఇన్సులిన్ వంటి సుగుణాలు, రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.

health benefits of clove teaఈ టీ సైనస్ నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. యూజీనాల్ ఉండటం వల్ల ముక్కు సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలలో విటమిన్ ఇ , విటమిన్ కె ఉంటాయి. ఇవి బాక్టీరియాతో పోరాడతాయి. జ్వరంను కూడా తగ్గిస్తాయి.

health benefits of clove teaఇక కోల్డ్ లవంగం టీ చేతులను శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు. మీ చేతులపై ఈ ద్రవాన్ని పూయడం వల్ల చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు ఆహ్లాదకరమైన వాసన వస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR