కొబ్బరి నీళ్ల నుండి నూనె వరకు ప్రతీ ఒక్కటీ ఆరోగ్యాన్ని అందిస్తుంది. కొబ్బరినూనెలో ఉండే లౌరిక్ ఆసిడ్ అధిక రక్తపోటు వంటి వివిధ హృదయ సమస్యలు దరిచేరకుండా సహాయపడుతుంది. కొబ్బరి నూనె మంచి కొలెస్ట్రాల్ మెరుగుపరచడంలో సహాయపడే HDL కొలెస్టరాల్ (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలు పెంచడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని చేదు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.
అందుకే కేరళలో వంటల్లో కూడా కొబ్బరినూనే ఉపయోగిస్తున్నారు. కాబట్టే అక్కడ అందరూ సన్నగానే ఉంటారు. వాల్ల జుట్టు కూడా పొడవుగా ఉంటుంది దానికి ప్రధానమైన కారణం వాళ్లు కొబ్బరినూనె వాడటమే. కేరళ తరహాలోనే మనకు కూడా బోలెడన్ని కొబ్బరి తోటలు ఉన్నాయి. కోనసీమలో అడుగు పెడితే అడుగుకో కొబ్బరి చెట్టు ఉంటుంది. అయినా మనం కొబ్బరి నూనెను ఇంకా తలకు వాడే తైలంగానే భావిస్తున్నాం.
కొబ్బరి నూనె శరీరంలోని కొవ్వును తగ్గించి నాజూకుగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం… కొబ్బరినూనె అనేది వేడిని పుట్టిస్తుంది. మనం సాధారణంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణ అవ్వడానికి చాలా పెద్ద ప్రక్రియే ఉంటుంది. ముందు మనం తీసుకున్న ఆహారాన్ని పొట్ట భాగంలో ఉన్న ఆమ్లాలు చిన్న చిన్న పదార్థాలుగా విచ్చిన్నం చేస్తాయి.
ఇలా చేయడానికి శక్తి అవసరమవుతుంది. సాధారణ ఆహారం కన్నా కొబ్బరి నూనెతో చేసిన ఆహారం జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది అంటే ఏ పని చేయకుండానే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అలాగే కొబ్బరి నూనె తాగడం ద్వారా కడుపు నిండినట్టుగా ఉండి ఎక్కువగా ఆకలి వెయ్యదు. అలా ఒకవైపు ఎక్కువ కేలరీలను ఖర్చు పెట్టి తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గుతారు.
వేగంగా మరియు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలి అనే విషయంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. టిఫిన్, మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనం చేసే అరగంట ముందు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను ఓ గ్లాసు నీలల్లో కలిపి గోరు వెచ్చగా చేసుకుని తాగాలట. అలాగే చేసుకున్న ప్రతి వంటను కొబ్బరినూనెతోనే చేసుకోండి.
ఇలా చేస్తూ ప్రతి మూడు నాలుగు రోజులకి ఒకసారి బరువుని చెక్ చేసుకోండి. కచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో బరువు తగ్గి పోవచ్చు అని మాత్రం అనుకోకండి. అలా తగ్గడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజుల్లో కాదు కానీ ఈ పద్ధతిని పాటించడం ద్వారా నెలల్లో కచ్చితంగా బరువు తగ్గుతారు. అంతేకాదు శరీరంలో చాలా ఆరోగ్యకరమైన మార్పు చూస్తారు. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చర్మ సౌందర్యం కూడా పెంచుతుంది.