ఈ డీటాక్స్ డ్రింక్స్ వేసవిలో వేడితోపాటు, బరువుని కూడా తగ్గిస్తాయి!

ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరిని ఇబ్బందిపెడుతున్న సమస్య అధిక బరువు. దీనికి కారణం పోషకాహార లోపం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కారణమవుతాయి. ఇక తమ బరువును తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు.

Benefits of Detox Drinksఇక్కడే డీటాక్స్ డ్రింక్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఈ డీటాక్స్ డ్రింక్స్ వల్ల వెయిట్ లాస్ జరగడం, మెటబాలిజం బూస్ట్ అవ్వడం, అరుగుదలకి సహకారం అందడం, స్కిన్ ఇంకా హెయిర్ హెల్త్ కి హెల్ప్ జరగడం వంటి ఎన్నో ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ డ్రింక్స్ ఏమిటో చూసేద్దాం…

ఆరెంజ్, క్యారెట్, జింజర్ :

ఆరెంజెస్ లో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్స్ లో బీటా కెరొటిన్ ఉంటుంది. ఇంక అల్లం అరుగుదలకీ, స్టమక్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికీ హెల్ప్ చేస్తుంది.

Benefits of Detox Drinksరెండు ఆరెంజెస్, ఒక క్యారెట్ తీసుకుని, వీటిని విడివిడిగా జ్యూస్ తీయండి. ఈ జ్యూసులని బ్లెండర్ లో పోసి అందులో అరంగుళం అల్లం ముక్క, అరంగుళం పసుపు కొమ్ము దంచి వేయండి. బ్లెండ్ చేసిన తరువాత సగం నిమ్మకాయ అందులో పిండండి. వడకట్టి తాగేయండి.

నిమ్మకాయ, పుదీనా :

Benefits of Detox Drinksఈ వేసవి కాలంలో హాయిగా తాగే డీటాక్స్ డ్రింక్ ఇది. ఐదు నిమ్మకాయల రసం తీయండి. మూడు కట్టల పుదీనా తీసుకోండి. పుదీనా సన్నగా తరిగి, నిమ్మ రసంతో పాటూ బ్లెండర్ లో వేయలి. అందులో అరకప్పు తేనె కలిపి తగినన్ని ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసి చల్లగా తాగేయండి.

కీరా, పుదీనా :

పుదీనా స్టమక్ అప్సెట్ ని సరి చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. దీనితో పాటు కీరా, నిమ్మకాయ కూడా కలిస్తే ఇక రుచీ చెప్పక్కరలేదు, జరిగే మేలు కూడా అంతే.

Benefits of Detox Drinksఒక కీరా తీసుకుని తొక్క తీసి ముక్కలుగా తరగండి. ఒక బ్లెండర్ లో కీరా ముక్కలు, సుమారుగా ఒక పది పుదీనా ఆకులు, ఒక కప్పు నీరు వేయండి. వడకట్టి, ఆ తరువాత రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలపండి. అవసరాన్ని బట్టి ఇంకాసిని నీళ్ళు కలిపి దీన్ని గ్లాసుల్లో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా ఆస్వాదించండి.

దానిమ్మ, బీట్రూట్ :

ఆయుర్వేదం లో దానిమ్మకి ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది. దీనికి బీట్రూట్, అలోవెరా కలిపిన ఈ డ్రింక్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.

Benefits of Detox Drinksరెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకుని క్లీన్ చేయండి. బ్లెండర్ లో రెండు కప్పుల దానిమ్మ రసం వేయండి. అందులోనే అరకప్పు సన్నగా తరిగిన బీట్రూట్ వేసి బ్లెండ్ చేయండి. ఇప్పుడు అలోవెరా జెల్ కలిపి ఒక్కసారి బ్లెండ్ చేసి పావు టీస్పూను బ్లాక్ సాల్ట్ కలిపి తాగేయండి.

యాపిల్, క్యారెట్, బీట్రూట్ :

Benefits of Detox Drinksఈ డ్రింక్ మీకు స్టమక్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం లో సహాయం చేస్తుంది. ఒక యాపిల్, ఒక క్యారెట్, అర కప్పు బీట్రూట్ తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేయండి.చిన్న ముక్క ముల్లంగి తీసుకుని సన్నగా తరగండి. రెండు నిమ్మకాయల రసం తీయండి. అన్నీ కలిపి బ్లెండర్ లో వేసి కొంచెం నీరు పోసి బ్లెండ్ చేసి వడకట్టి తాగేయండి.

తేనె, నిమ్మకాయ, అల్లం టీ :

ఇండియన్లకి టీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. కొద్దిగా అల్లం, తేనె, నిమ్మకాయ కూడా కలిపిన ఈ టీ గొంతులో మంట, జలుబు తగ్గించడానికి కూడా వాడతారు. అయితే, ఈ టీకి ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

Benefits of Detox Drinksఒక ప్యాన్ లో మూడు కప్పుల నీరు వేడి చేయండి. నీరు మరగడానికి ముందు సన్నగా తరిగిన అల్లం ఒక టీస్పూన్ వేయండి. మరగడం మొదలు పెట్టగానే మూడు టీస్పూన్ల టీ ఆకులు, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి వడకట్టి తాగేయండి.

కొబ్బరినీరు, పుదీనా, నిమ్మరసం :

ఈ డీటాక్స్ డ్రింక్ కి కేవలం మూడు పదార్ధాలే చాలు. కానీ లివర్, ఇంటెస్టెయినల్ ట్రాక్ట్ క్లీన్స్ చేస్తుంది. మీకు చక్కని ఫ్రెష్ ఫీలింగ్ ని ఇస్తుంది.

Benefits of Detox Drinksఒక కొబ్బరి కాయ కొట్టి అందులోని నీరు ఒక పాత్ర లోకి తీసుకోండి. లేత కొబ్బరిని తీసి సన్నగా ముక్కలు చేసి కొబ్బరి నీరులో కలిపేయండి. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక నిమ్మ కాయ నుండి తీసిన రసం ఇందులో కలపండి. పుదీనా ఆకుల తరుగుతో గార్నిష్ చేసి ఆస్వాదించండి.

అల్లం, లిచీ, నిమ్మరసం :

అల్లాన్ని ఎక్కువగా టీ రూపంలోనే తీసుకుంటారు. అల్లం ఇన్‌ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అల్లాన్ని నిమ్మరసం, లిచీ తో కలిపి తీసుకుంటే ఆ రుచే వేరు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Benefits of Detox Drinksఅర కప్పు అల్లం తురుము తీసుకోండి. అర కప్పు తాజా నిమ్మ రసం కూడా తీసుకోండి. ఒక గ్లాసు లిచీ జ్యూస్ తీసుకోండి. ఒక బ్లెండర్ లో అల్లం తురుము, నిమ్మ రసం, లిచీ జ్యూస్, కొద్దిగా ఐస్, రుచికి తగినంత ఉప్పు వేసి బ్లెండ్ చేయండి. ఆ రసాన్ని ఒక జార్ లో పోసి ఒక కప్పు ద్రాక్ష పండ్ల సన్నని తరుగు, అర కప్పు చియా సీడ్స్ కలపండి. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులతో గార్నిష్ చేసి చల్లగా తాగేయండి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR