Home Health దొండకాయల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

దొండకాయల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

మార్కెట్లలో లభ్యమయ్యే ఆరోగ్యకరమైన కూరగాయలలో దొండ ఒకటి. అన్ని కాలాల్లో లభ్యమయ్యే గ్రీన్ వెజిటేబుల్ దొండకాయ. గ్రామాల్లో దీనిని తీగదొండ అంటారు. గ్రామాల్లో దాదాపు చాలా మంది ప్రజల ఇంటిలో ఈ చెట్టు ఉంటుంది. దొండకాయతో వేపుడు చేసుకున్నా, మాములుగా కూరలా వండుకున్నా ఎంతో రుచికరంగా ఉంటుంది.

Dondakayaరుచి పరంగానే గాక దొండతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక దొండకాయలో ఎన్నో పోషక విలువలున్నాయి. ఇందులో ఫైబర్, విటమిన్ ఎ, బి 1, సి, కాల్షియం అధికంగా ఉంటాయి.

దొండకాయలను కూర వండుకుని తినడం వల్ల కఫం సమస్య తొలగిపోతుంది. ఇందులోని యాక్సిడెంట్లు బాక్టీరియాలను అడ్డుకుంటాయని ఆయుర్వేదం చెబుతుంది.

అలాగే మలబద్ధకం సమస్య కూడా నివారించడంలో దొండ ఎంతో ఉపయోగకారి. దొండ విత్తనాలు జీర్ణక్రియను మెరుగుపరుచుతాయి. ఇందులో ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.

ఇది రోగనిరోధక శక్తి ని కూడా పెంపొదిస్తుంది. దొండ ఆకు రసాలను నీటిలో తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

అంతేగాక.. విరేచనాల సమస్యను కూడా ఇది నివారిస్తుంది. దొండ ఆకు రసాన్ని రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

దొండ తినడం వల్ల పొడి చర్మం మృదువుగా మారుతుంది. ఇది డయాబెటిస్ సమస్యను కూడా తొలగిస్తుంది.

 

Exit mobile version