డ్రాగెన్ ఫ్రూట్ అనే పేరు ఎందుకు వచ్చింది? దీని వలన ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0
222

పండ్లు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. కానీ వాటిలో మనకు కొన్ని పండ్లు మాత్రమే తెలుసు. ఎప్పుడు వాటినే తింటాం. కొత్తవాటిని తినడానికి ఇష్టపడము. కానీ ప్రతి పండు ఆరోగ్యానికి మంచిదే. అందులో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి.

Dragon Fruitడ్రాగన్ ఫ్రూట్. ఈ పేరే చిత్రంగా ఉంటుంది. డ్రాగన్ అనేది చైనాలో పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ,శత్రువుల్ని సంహరిస్తుంది. అలాంటి డ్రాగన్స్ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. మరి ఆ పేరును ఈ పండ్లకు ఎందుకు పెట్టారంటే, వీటి ఆకర్షణీయమైన రంగు, రూపురేఖల వల్లే. ఎన్ని పండ్లు ఉన్నా డ్రాగన్ పండ్లను ఇట్టే గుర్తించగలం. గులాబీ రంగులో ఉండే ఈ పండుకి చుట్టూ ఉన్న రేకులు పసుపు, పచ్చ రంగులో ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది. ఆసియాకు విస్తరించింది. థాయ్‌లాండ్, వియత్నాం ప్రజలకు ఈ పండ్లంటే విపరీతమైన ఇష్టం.

Dragon Fruitడ్రాగన్ పండ్లలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా ఎక్కువే. అందువల్ల ఈ పండ్లు ఎంత తింటే అంత చురుకుగా తయారవుతారు. చాలా శక్తి కూడా వస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్స్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్దకంతో బాధపడేవారు దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్దకాన్ని తరిమి కొట్టవచ్చు.

Dragon Fruitబరువు తగ్గాలనుకునేవారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. మధ్యలో గింజలుంటాయి. అందువల్ల దీనిని తినడం వల్ల బరువు తొందరగా తగ్గుతారు.

Dragon Fruitడ్రాగన్ ఫ్రూట్ శరీరంలోని చెడు కొలస్ట్రాల్ ని తొలిగించి,గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే మోనోసాచురేటేడ్ ఫ్యాట్‌లు గుండె ఆరోగ్యాంగా ఉండేలా ప్రోత్సహిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్, కాల్షియం, పాస్పరస్, ఐరన్, నియాసిన్ మరియు ఫైబర్‌లను కలిగి ఉంటాయి. దీనిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Dragon Fruitడ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు చర్మానికి మేలు చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ను దంచి, తేనె కలిపి సహజయాంటీ ఏజింగ్ మాస్క్‌ను తయారు చేయవచ్చు. అంతేకాకుండా దీని వాడకం ద్వారా మొటిమల నుండి ఉపశమనం కూడా పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Dragon Fruitఈమధ్య కాలంలో ప్రపంచదేశాలతోపాటూ ఇండియాలో కూడా ఎక్కువగా కనిపిస్తున్న పండ్లలో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉంటున్నాయి. వీటి ప్రయోజనాల్ని గుర్తించి భారత దేశంలో ప్రభుత్వం వీటి సాగుకు కృషిచేస్తోంది.

 

SHARE