వేడినీళ్లు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రపంచమంతా స్థంబించిపోయేలా చేసిన కరోనా అందరిని బయపెట్టుకుంటుంది. జనం కరోనా పేరు వింటే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. కోవిడ్ సృష్టిస్తున్న విలయాన్ని కళ్లారా చూసి భయంతో వణికిపోతున్నారు. మహమ్మారి బారి నుండి బయటపడడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ సంక్రమణ నివారణకు పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

Health benefits of drinking hot waterవేడి నీళ్లు ఎక్కువ తాగడం, వేడి నీళ్లు గొంతులో పోసుకుని పుక్కిలించడం, వేడి నీళ్లలో పసువు కలుపుకుని తాగడం, వేడి ద్రవపదార్థాలు తాగాలని పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరు తమ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, అందుకోసం విటమిన్ సి, సిట్రస్ ఎక్కువగా ఉండే ఫలాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Health benefits of drinking hot waterసోషల్ మీడియాలోనో, టీవీ లోనో చూసి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి చిట్కాలు వల్ల కరోనా పోగొట్టుకోవచ్చు అని వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టడం లాంటివి చేస్తున్నారు. అదే విధంగా గార్గిలింగ్ లాంటివి కూడా ప్రయత్నం చేస్తున్నారు.

Health benefits of drinking hot waterవేడి నీటిని తాగడం వల్ల గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. వేడి నీళ్లలో ఒక చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతునొప్పి నుంచి ఉపశమనం కలుగుతంది. నిత్యం వేడి నీళ్లు తాగడం వల్ల శరీరం నుంచి వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణక్రియ కూడా మెరుపడుతుంది. అదే విధంగా పసుపు కూడా గార్గిలింగ్ లో బాగా ఉపయోగపడుతుంది. పసుపులో యాంటి సెప్టిక్ గుణాలు మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అనేక సమస్యలను పసుపు తరిమికొడుతుంది.

Health benefits of drinking hot waterవేడి నీటితో స్నానం చేస్తే ఒళ్లు నొప్పి తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కండరాలు, కీళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వేడి నీటితో స్నానం చేస్తే చక్కగా నిద్రపడుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కొంతమంది వేడి నీళ్లు తాగడం, పుక్కిలించడం వలన కరోనా తగ్గుతుంది ప్రచారం చేస్తున్నారు. అయితే అందులో నిజం లేదంటున్నారు నిపుణులు. వేడి నీటితో కరోనా తగ్గదు కానీ.. కొంత వరకు మాత్రం ఉపశమనం కలుగుతుంది.

Health benefits of drinking hot waterవేడి నీళ్లు తాగడానికి, గార్గిలింగ్ చేయడానికి కరోనాతో సంబంధం లేదు. సాధారణంగా కూడా కొద్దిగా గోరు వెచ్చని నీటితో రోజులో మూడు సార్లు చేయొచ్చు. ఉదయం అల్పాహారం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మరియు రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత చేస్తే మంచిదని డాక్టర్లు అంటున్నారు. రాత్రి నిద్ర పోయేటప్పుడు గార్గిలింగ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Health benefits of drinking hot waterగార్గిలింగ్ చేయాలంటే నీళ్లు బాగా మరిగిన వెంటనే రెండు స్పూన్లు పసుపు కొద్దిగా కల్లు ఉప్పు వేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత గార్గిలింగ్ చేస్తే బాగా పనిచేస్తుంది. ఈ వాటర్ తో కావాలంటే ఆవిరి కూడా పట్టొచ్చు. మంచి రిలీఫ్ గా ఉంటుంది. అయితే దానికోసం మరీ ఎక్కువ వేడి నీటిని తీసుకోవద్దు. మామూలు నీళ్లతో చేసినా కూడా పర్వాలేదు.

Health benefits of drinking hot waterఅలాగే వేడి నీళ్లు తాగుతున్నాం కదా అని చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలా ముమ్మాటికీ చేయకూడదు. ఎన్ని ఇంటి చిట్కాలు వాడినా సరే మాస్క్ ధరించడం, సామజిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం మాత్రం మర్చిపోవద్దు. ఈ నియమాలు పాటిస్తూ నివారణ చిట్కాలు ఫాలో అయితే కరోనాని కొంత వరకు అదుపుచేయవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR