సొరకాయ జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కూరగాయలు ఆరోగ్యానికి మంచివని, అందుకే ప్రతి రోజూ ఏదో ఒక కూరగాయ తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. చూడగానే నోరు ఊరించకపోయినా సొరకాయ వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వేదకాలం నుంచి వాడుకలో ఉన్న సొరకాయ శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. సొరకాయలో ఎక్కువ నీటి శాతం ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మరింత మంచిది. దీనిలో దాదాపు 96 శాతం నీళ్లు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి, సోడియం, ఐరన్, జింక్, పొటాషియం వంటి విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. ఒక కప్పు సొరకాయ జ్యూస్ ద్వారా 26 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ని పొందవచ్చు. ఈ సొరకాయని కూర, స్వీట్స్, వంటివి చేయడానికి ఉపయోగిస్తారు.

Health Benefits of Drinking Pumpkin Juiceఅయితే సొరకాయను ప్రతిసారీ కూర, సాంబార్ గా వండుకుని తినీ తినీ బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఈసారి సొరకాయను జ్యూస్ రూపంలో అదికూడా అల్లం కలిపి తీసుకుంటే.. టేస్ట్ తోపాటు, ఆరోగ్యానికి కూడా ఎంతోగానో ఉపయోగపడుతుంది. సొరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి,ఆ తర్వాత కొంచెం ఉప్పు, జీరా పొడి, మిరియాల పొడి, పుదీనా ఆకులు వేసి , మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత వచ్చే జ్యూస్ ను తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

Health Benefits of Drinking Pumpkin Juiceఇలా కుదరకపోతే కనీసం సొరకాయ, అల్లంతో జ్యూస్ చేసుకొని తాగిన ప్రయోజనం ఉంటుంది. అర గ్లాసు సొరకాయ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం కలపాలి. ఈ రెండూ బాగా కలిపి తాగాలి. ఈ జ్యూస్‌ను ప్రతిరోజూ ఉదయం అల్పాహారానికి ముందు తాగాలి. కనీసం 6 వారాల పాటు ఈ జ్యూస్ తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

Health Benefits of Drinking Pumpkin Juiceజీర్ణక్రియ మెరుగుపడడానికి ఈ జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. తిన్న ఆహారం మరింత శక్తి వంతంగా తేలికగా జీర్ణం కావడానికి బాగా సహాయపడుతుంది. ఈ న్యాచురల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది. శరీరంలోని ఉందే వ్యర్థా పదార్థాలను తేలికగా బయటకు పంపించడంలో ఎంతో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గాలనుకొనే వారికి ఇది ఎంతో సహాయపడుతుంది.

Health Benefits of Drinking Pumpkin Juiceఅనారోగ్యకర ఆహారపు అలవాట్లు, అధిక మద్యపానం, కొన్ని అంటువ్యాధులు, ఔషధాల దుష్ప్రభావాలు మొదలైనవి కాలేయం యొక్క వాపుకు దారి తీయవచ్చు. అలాంటి సందర్భంలో కాలేయం దగ్గర మంటగా అనిపిస్తుంది. ఈ సొరకాయ-అల్లం మిశ్రమం ఈ కాలేయమంటను నివారిస్తుంది. సొరకాయ- అల్లం యొక్క మిశ్రమంలో వ్యాదినిరోధకాలు మరియు పొటాషియం ఉన్న కారణాన కండరాలు ఉత్తేజితమవ్వడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. స్ట్రెస్‌, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. నరాలను రిలాక్స్ చేసి ప్రశాంతతను కలిగిస్తుంది.

Health Benefits of Drinking Pumpkin Juiceరక్తహీనత సమస్యతో బాధపడేవారికి సొరకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండేటువంటి ఐరన్,ఈ సమస్య నుంచి బయట పడేస్తుంది. సొరకాయ గుండె ఆరోగ్యాన్ని కాపాడే జింక్ ను కలిగి ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా శరీరంలోని రక్త సరఫరాలను క్రమబద్ధీకరిస్తూ, అధిక రక్తపోటు సమస్య నుంచి బయట పడవేస్తుంది. తీవ్రమైన అతిసార, మధుమేహం ఉన్నవారికి కూడా సొరకాయ బాగా పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది.

Health Benefits of Drinking Pumpkin Juiceయూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ప్రతిరోజు ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే యూరినరీ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కంటి చూపుతో ఇబ్బందిపడేవారు సొరకాయ జ్యూస్ తాగడం వల్ల, ఇందులో విటమిన్ A పుష్కలంగా ఉండటం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. సొరకాయ చర్మాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR