టీ తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

0
386

టీ అంటే చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. ఆఫీసుల్లో పనులతో అలసిపోయినా.. ఇంటి పనులతో తలమునకలైనా మొదటిసారిగా గుర్తొచ్చేది టీనే.. ఒక కప్పు పొగలు కక్కే టీ తాగడం వల్ల అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి అంతా ఒక దెబ్బతో పోతుంది. ఈ టీని తాగడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

health benefits of drinking teaసామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకూ అందుబాటులో ఉండే ఛాయ్ గొప్పదనం అది.. టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పాలు కలిపి తయారు చేస్తారు. దీని వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు అందుతాయి. దీంతో ఎముకలు కూడా దృఢంగా మారాతాయి. సాధారణంగా ప్రతీ రోజూ టీ తాగితే ఎక్కువ రోజులు బతుకుతారని చైనీయులు ఎక్కువగా నమ్ముతారట.. అక్కడి వారు టీని ఎక్కువ ఇష్టంగా తాగుతారు.

health benefits of drinking tea

  • టీ తాగటం వల్ల రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది.
  • టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ కలిగి ఉంది.
  • రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడుతుంది
  • జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
  • గుండె వ్యాధులు, క్యాన్సర్, బరువు తగ్గడం, నిరోధిస్తుంది.
  • పాడైన జీవకణాలను ఉత్తేజపరుస్తుంది.

 

SHARE