డ్రైఫ్రూట్స్ తినడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసా ?

డ్రైఫ్రూట్స్.. ఆరోగ్యానికి చాలామంచిది. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అని అందరికి తెల్సిందే.. అయితే ఇందులో ఏమేం తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of dry fruitsఆరోగ్యంగా ఉండాలంటే మన రోజువారీ జీవితంలో కొన్ని ఆహార మార్పులు చేసుకుంటే సరి. అందులో భాగంగానే కొన్ని డ్రైఫ్రూట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి. . ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తాజా పరిశోధనల ప్రకారం ఇలా ప్రోటీన్స్‌తో నిండిన ఆహారం తీసుకుంటే జీవన ప్రమాణాలు పెరిగినట్లు తేలింది. శాకాహారంతో లభించే మాంసకృత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మరణించే రేటు 13 శాతం తగ్గుతుందని తేల్చారు.. వృక్ష సంబంధ ప్రోటీన్లు తీసుకుంటే శరీరానికి ఎన్నో లాభాలున్నాయని, దీని ద్వారా జీవనప్రమాణాలు మెరుగుపడతాయని, ఆరోగ్యంగా ఉంటామని గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 16శాతం తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే దీంతో పాటు మాంసాహారం కూడా తగ్గించడం మంచిది. అది కేవలం మాంసాహారం ఎక్కువగా తినేవారు తగ్గించాలి.

health benefits of dry fruitsగింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ కారణంగా అధికబరువు కూడా తగ్గుతారు. ఇందులోనూ ముఖ్యంగా సోయా తీసుకోవడం వల్ల అదనపు లాభాలుంటాయి. రక్తంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సోయా చక్కగా పనిచేస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ ఉన్న సోయా మిల్క్ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ కారణంగా మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.. గింజల్లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇక బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఆప్రికాట్స్, డేట్స్ వీటన్నింటిని కూడా నట్స్ కిందకే వస్తాయి. ఇందులో ఒక్కో నట్స్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎంతో రుచిగా ఉండే ఈ నట్స్ మంచి న్యూట్రీషియన్స్ వాల్యూస్ ని కలిగి ఉంటాయి.

health benefits of dry fruitsనట్స్ తినడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది. మెమరీ కూడా బాగుంటుంది. అందుకే రెగ్యులర్‌గా తీసుకోవాలి. ముఖ్యంగా వాల్ నట్స్ తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా వీటిని నానబెట్టి తినడం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. వాల్ నట్స్‌లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఎముకలు, పళ్లను బలంగా మారిస్తే.. ఇందులోని ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుంది. అంతేనా.. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అధికబరువు, నిద్రలేమి, వంటి సమస్యలు దూరమవ్వడమే కాకుండా.. గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిక్ ఉన్నవారికి వల్‌నట్స్ అద్భుతవరమని చెప్పొచ్చు. అదే విధంగా ఇందులోని కొన్ని ప్రత్యేక గుణాలు, మానసిక సమస్యలను దూరం చేసి డిప్రెషన్‌ని దరిచేర్చకుండా ఉంచుతుంది.

health benefits of dry fruitsబాదంపప్పులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే రెగ్యులర్‌గా వీటిని తీసుకోవాలి. గర్భిణీలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిదంటారు. ఇందులో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన రక్తంలో చేరిన టాక్సిన్లు, హానికరమైన మలినాలను ఎప్పటికప్పుడు బయటికి పంపుతాయి… ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి అథ్లెట్లు, జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేసే వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. రోజూ పాలు తాగేవారు.. పాలకి బదులు బాదంపాలని తాగితే అదనపు లాభాలు మీ సొంతమవుతాయి. బాదంలలో ఆల్కలీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఆమ్లత్వాన్ని సమతౌల్యంగా ఉండేలా చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు రెగ్యులర్‌గా బాదంలు తింటే చాలామంచిదని చెబుతున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. బాదం తినడం వల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉండి.. గ్లూకోజ్‌ని శరీరం శోషించుకుంటుంది. ఈ కారణంగా డయాబెటీస్ అదుపులో ఉంటుంది.

బాదం తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. బాదం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా అందం పెరిగేందుకు కూడా ఉపయోగపడతుంది. చర్మం ముడతలు పడకుండా ఉండి.. నిగనిగలాడుతుంది. జుట్టు సమస్యలు కూడా చాలావరకూ తగ్గుతాయి. దీనిలోని పీచుపదార్థం మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది. బాదంలో మోనోసాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి మీ జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచుతాయి. తద్వారా బరువు అదుపులో ఉంటుంది. వీటితో పాటు బాదంలో పాస్పరస్, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి.

health benefits of dry fruitsవీటితో పాటు.. పప్పు దినుసులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పప్పన్నం తినడం వల్ల చాలా మంచి లాభాలుంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పేరుకుపోయిన కొవ్వుని తగ్గించడంలో పప్పుదినుసులు బాగా పనిచేస్తాయని తాాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిలోని ఫొలేట్, మెగ్నీషియం, పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అదేవిధంగా, ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. అంతేనా.. పప్పులు తినడం వల్ల మలబద్ధకం కూడా తగ్గి అధిక బరువు సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి రోజూ పప్పన్నం మీ మెనూలోకి చేర్చుకోండి.

ఇలా డ్రైఫ్రూట్స్, పప్పుదినుసులు, చిక్కుళ్లు, సోయా ఇలాంటివన్నీ ఎలా తీసుకున్నా మన శరీరానికి అదనపు లాభాలే ఉంటాయి. బాదం, వాల్నట్స్ వంటివి నానబెట్టుకుని కూడా తినొచ్చు. దీని వల్ల శరీరానికి అదనపు శక్తిని ఇచ్చినవారవుతాం. అయితే కొన్ని రోజులే ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకుని, తర్వాత వదిలేయకుండా కంటిన్యూ చేయడం మన ఆరోగ్యానికి మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR