కొత్తిమీరను తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఇప్పుడున్న కాలంలో అంద‌రినీ వేధించే స‌మ‌స్యలు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌లు. స‌రైన ఆహార నియ‌మాలు పాటించ‌క‌పోవ‌డం, రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌లన బ‌రువు పెరిగిపోతున్నారు. ఒక్క‌సారి బ‌రువు పెరిగిన త‌రువాత త‌గ్గ‌డం చాలా క‌ష్ట‌మైన‌ప‌ని. కొంత‌మంది ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా బ‌రువు త‌గ్గ‌క‌పోవ‌డంతో చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు.

Health benefits of eating corianderఅయితే శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యే ఆహార‌ప‌దార్థాలు, కొవ్వును కరిగించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుంటే.. బ‌రువు పెర‌గ‌కుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండ‌వ‌చ్చు. ఏ కూర వండినా చివరగా కొద్దిగా కొత్తిమీర వేయకపోతే ఏదో వెలితిగానే అనిపిస్తుంది. చక్కని సువాసన,కమ్మని రుచి కలిగిన కొత్తిమీరను ఆహార పదార్థాలలో వేస్తె ఆ రుచి అదరహో అనేలా ఉంటుంది. అంతేకాక దీనిని తరచుగా తినటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Health benefits of eating corianderకొత్తిమీరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కొవ్వును కరిగించే విటమిన్స్, యాంటి ఆక్సి డెంట్స్ సమృద్దిగా ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారికి మంచి మందుగా పనిచేస్తుంది. రక్తంలో చక్కర నిల్వలను సమన్వయ పరుస్తుంది. మెగ్నీషియం, మాంగనిస్, ఇనుము తగిన మోతాదులో ఉంటాయి. విటమిన్ సి,కె లు,ప్రోటిన్స్ కూడా ఉంటాయి. దీనిని తరచుగా ఆహారంలో తీసుకుంటే మన శరీరంలో ఉన్న హానికరమైన కొవ్వు కరుగుతుంది.

Health benefits of eating corianderకొత్తిమీరలో అధికంగా లభించే విటమిన్ కె వయస్సు మళ్ళిన తర్వాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటి ఇన్ఫ్ల మేటరి గుణాలు కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. కొత్తిమీరలోని యాంటి సెప్టిక్ లక్షణాలు నోటి పూతను తగ్గిస్తాయి. కొత్తిమీర జ్యూస్ వల్ల కూడా శరీరంలోని కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. అందుకే దీన్ని వంటకాల్లో ఉపయోగించడంతో పాటు జ్యూస్ తయారు చేసుకుని తాగితే కూడా మంచి ప్రయోజనాలుంటాయి.

Health benefits of eating coriander
కొత్తిమీర జీర్ణ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే జీర్ణ స‌మ‌స్య‌లైన గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వ‌ల్ల శ‌రీరం శుభ్ర‌మ‌వుతుంది. శ‌రీరంలో ఉండే విష, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

Health benefits of eating coriander జీర్ణకోశంలో గ్యాస్‌ ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్ర విసర్జన జరిగేట్టు చేసి కిడ్నీల ఆరోగ్యానికి కొత్తిమీర‌ దోహదపడుతుంది. జ్వరం వ‌చ్చిన వారు కొత్తిమీర జ్యూస్ తాగితే ఫ‌లితం ఉంటుంది. కొత్తిమీర‌లో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు అన్ని ర‌కాల జ్వ‌రాల‌ను తగ్గిస్తాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR