వేసవిలో పెరుగు తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఉక్కపోత.. చెమట.. వడదెబ్బ.. ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఎండల ప్రభావం వల్ల శారీరకంగా..మానసికంగా..కృంగి పోతుంటారు. ఎండల వేడిమికి మన శరీరంలో కూడా వేడి పెరుగుతుంది. ఈ అంతర్గత వేడి వల్ల చిరాకు, తలనొప్పి, ఉబ్బరం, అజీర్ణం, అలసట, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విపరీతమైన వేడి కారణంగా ముఖం పై మొటిమల వంటి సమస్యలు కూడా వస్తు ఉంటాయి. అయితే ఈ సమస్యలకు పెరుగుతో చెక్ పెట్టవచ్చు.

Health benefits of eating curd in summerమనం తీసుకొనే అన్ని ఆహారాల్లో కంటే పెరుగులో అధిక న్యూట్రీషియన్స్ ఉన్నాయి. అందువల్లే మన ఇండియన్ రెసిపిలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మన ఇండియాలో మనం తీసుకొనే ప్రతి ఆహారంలో కర్డ్ తప్పని సరిగా ఉంటుంది. వేసవి తాపాన్ని తీర్చే పెరుగులో మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో పెరుగు తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Health benefits of eating curd in summerవేసవి లో ఎదురయ్యే అలసట, నీరసం వంటివి పెరుగుతో పోతాయి. చాలా అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం మలబద్ధకం, అజీర్ణం వంటివే. తినే ఆహారం సరిగా జీర్ణమైతే… బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. తద్వారా బాడీలో అన్ని అవయవాలూ బాగా పనిచేస్తాయి. బ్రెయిన్ బాగా పనిచేసేలా, ఒత్తిడి, టెన్షన్, ఆదుర్తా వంటివి పోగొట్టడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది.

పెరుగు తినడం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

Health benefits of eating curd in summerక్యాన్సర్‌ను అడ్డుకునే శ‌క్తి పెరుగులోని ఔష‌ధ గుణాల‌కు ఉంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్లడైంది.

పెరుగును రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Let’s boost immunity with home tips in Corona Second Waveవేసవి కాలంలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరం న్యూట్రీషియన్స్ ను గ్రహిస్తుంది.

ఓస్టిరియోఫోసిస్ తో బాధపడుతున్న వారు మితంగా పెరుగును తీసుకోవడం వల్ల ఈ సమస్యను క్రమంగా తగ్గించుకోవచ్చు. సమ్మర్ లో, శరీరం నుండి నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. కాబట్టి, మజ్జిగను రెగ్యులర్ గా త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి శరీరంలో నీటి స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది.

Health benefits of eating curd in summerమజ్జిగ ఒక బెస్ట్ ఇండియన్ సమ్మర్ డ్రింక్. పెరుగుతో తయారుచేసే మజ్జిగ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మరియు ఇది సన్ స్ట్రోక్ నుండి మనల్ని రక్షిస్తుంది.

Health benefits of eating curd in summerపెరుగులో ఉండే హెల్తీ బ్యాక్టీరియ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR