Home Health కోడిగుడ్డు రోజు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కోడిగుడ్డు రోజు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

కోడి గుడ్డులో బోలెడన్ని పోషక పదార్థాలు, ప్రొటీన్లు, కొలిన్ ఉంటాయి. అందుకే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తారు. ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్‌ శరీరానికి అందుతుంది. ఇందులో అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.

Health Benefits of Eggsఅలాగే రోజుకు ఒక కోడిగుడ్డును తీసుకుంటే.. బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. అల్పాహారంలో తప్పకుండా కోడిగుడ్డును తీసుకుంటే మంచిది. కోడిగుడ్లను తరుచూ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే పెరిగే చిన్నారులకు రోజుకు ఓ కోడిగుడ్డును ఇవ్వడం చేయాలి.

గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది.

గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. అలాగే నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇది నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది.

అయితే, మితంగా ఇంటేనే అది ఆరోగ్యానికి మంచిది. తినే ఆహారం ఏదైనా మితంగా తింటే అమృతం.. అమితంగా తింటే విషం అవుతుంది. గుడ్డు కూడా అంతేనట. రోజూ రెండు కంటే ఎక్కువ కోడిగుడ్లు తింటే గుండెకు ముప్పని తాజా సర్వే హెచ్చరిస్తోంది.

కోడిగుడ్లలో కొవ్వు ఉంటుందని, దీనిని రోజూ అతిగా తీసుకుంటే చేటు చేస్తుందని మసాచుసెట్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక్కో గుడ్డులో 200 మిల్లీగ్రాముల కొవ్వు ఉంటుందని, ఇది రోజుకు 300 మిల్లీగ్రాములు దాటితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని, అకాల మరణం సంభవించే రేటు కూడా 18 శాతం ఉంటుందని వెల్లడించారు.

 

Exit mobile version