పొన్నగంటి కూర తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అధిక ఔషధాలు కలిగిన ఆకుకూరలలో పొన్నగంటి కూర ఒకటి. ఈ పొన్నగంటి కూర (Alternanthera sessilis) అమరాంథేసి కుటుంబానికి చెందిన ఒక ఆకుకూర. దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించి తింటే చాలా రుచికరంగా వుంటుంది. ఇది అతి సులభంగా, అతి తొందరగా అభివృద్ధి చెందే ఆకు కూర. దీనికి విత్తనాలు వుండవు. ఇది కేవలం కాండం ద్వారా అభివృద్ధి చెందు తుంది. పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి.

Health Benefits of Eating Ponnaganti curryపొన్నగంటి కూర ఆకులు ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ లకు మంచి మూలం. ఇంకా విటమిన్ ‘ఎ’, ‘బి6’, ‘సి’, ఫొలేట్, ‘రైబోఫ్లెవిన్’, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా దొరకుతాయి. పురాతన పుస్తకాలు, భారతీయ వైద్య గురువులు చెప్పిన దాని ప్రకారం పొన్నగంటి కూర ఆకులు నలభై ఎనిమిది రోజులు తింటే, కీలకమైన ఖనిజాలు, పోషకాల అధిక కంటెంట్‌ను అందిస్తుందని, ఇది కళ్ళను పోషించడంలో సహాయపడుతుందని, చర్మానికి సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది.

Health Benefits of Eating Ponnaganti curryపొన్నగంటి కూరను పలురకాలుగా కూరలుగా వాడతారు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు.

Health Benefits of Eating Ponnaganti curryఆయుర్వేద ఔషధంలో ఈ ఆకులను వంటిలోని రుగ్మతలను శుభ్రపరిచేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు.

థైలాం అని పిలువబడే పొన్నంగంటి నూనె శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుందని, భారతదేశంలో అధిక శరీర వేడి, తలనొప్పి తగ్గటానికి ఉపయోగిస్తారని తెలుస్తుంది.

Health Benefits of Eating Ponnaganti curryజుట్టుకు పోషణనిచ్చే బయోటిన్‌ దీనిలో సమృద్ధిగా ఉంటుంది.

పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి.

Health Benefits of Eating Ponnaganti curryరక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది.

దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది.

ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం సరికాదు.అలా చేయడం వల్ల ఒక్కోసారి వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.

Health Benefits of Eating Ponnaganti curryపొన్నగంటి ఆకును ఉడికించుకుని అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

పొన్నగంటి ఆకుతో రసం తయారుచేసి ప్రతిరోజూ సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

Health Benefits of Eating Ponnaganti curryప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారాల్లో, పీల్చుకునే గాలిలో రసాయనాలు ఉండడంతో అవి రక్తంలో కలిసిపోతున్నాయి. దాంతో రక్తం అశుభ్రమైపోతుంది. పొన్నగంటి కూర తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. పొన్నగంటి ఆకు, పెసరప్పు బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత నూనెలో ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి వేసి వేయించి పొన్నగంటి ఆకులో వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఈ కూరను అన్నంలో కలిపి తీసుకుంటే దాని రుచే వేరు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR