స్టార్‌ ఫ్రూట్‌ తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు

స్టార్‌ ఫ్రూట్‌ లేదా కారంబోలా పండ్లను పురాతన కాలం నుంచి మన దేశంలో సాగు చేస్తున్నారు. ఈ చెట్టు కాయల ఆకృతిని బట్టి దీన్ని నక్షత్ర పండు చెట్టు లేదా స్టార్‌ ఫ్రూట్‌ ట్రీ అని పిలుస్తారు. కానీ నిజానికి ఈ చెట్టు పేరు అవెర్రోవా కారంబోలా. ఈ పండ్లను కారంబోలా అంటారు. వీటిని ఆగ్నేయాసియా, దక్షిణ పసిఫిక్‌, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. ఈ చెట్టు 25 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది. నాటిన 3 నుంచి 4 సంవత్సరాల్లో కాయలు కాస్తాయి. రాత్రి సమయంలో చెట్టు ఆకులు ముడుచుకుంటాయి.

స్టార్‌ ఫ్రూట్‌స్టార్ ఫ్రూట్స్ వేసవిలో మాత్రమే పండుతాయి. ద్రాక్ష మాదిరిగానే వీటిమీద కూడా మైనపు పూత ఉండి మెరుస్తుంటాయి. పచ్చి కాయలు నిమ్మ ఆకుపచ్చ రంగులో ఉండి తినటానికి వగరుగా, పులుపుగా ఉంటాయి. పండిన పండ్లు లేత పసుపు పచ్చ రంగులో ఉండి తినటానికి తియ్యగా పులుపుగా ఉంటాయి. బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. ఇవి సెప్టెంబర్ – అక్టోబర్ మాసాలలో మరియు జనవరి- ఫిబ్రవరి మాసాలలో లభిస్తాయి.

స్టార్‌ ఫ్రూట్‌ఇందులో రెండు రకాల పండ్ల చెట్లున్నాయి. ఒక రకం పుల్లగా, మరో రకం తీయగా ఉంటాయి. ఈ పండ్లలో పుల్లని రకాలను వంటకాలు, కూరల్లో వాడతారు. తీయని వాటితో పండ్ల రసాలు, జామ్‌లు తయారు చేస్తారు. నేరుగానూ తినొచ్ఛు. తియ్యనివి వేసవి నుంచి శీతాకాలం వరకూ కాస్తే పుల్లనివి వేసవి చివర నుంచి చలికాలం మధ్య వరకూ మాత్రమే కాస్తాయి. తియ్యని పండ్లు తిన్నప్పుడు కూడా ఎక్కడో పులుపు తగులుతుంటుంది. అయితే వీటి రుచి ఇది అని కచ్చితంగా చెప్పడం కష్టం.

స్టార్‌ ఫ్రూట్‌యాపిల్‌, పియర్‌, సిట్రస్‌ పండ్లు కలగలిసిన రుచితో ఉంటుందని కొందరంటే, బొప్పాయి, నారింజ, గ్రేప్‌ఫ్రూట్‌ కలగలసిన రుచిలో ఉంటుందని మరికొందరంటారు. మొత్తం పండునంతా చూస్తే నక్షత్ర ఆకారం కనిపించదు.. కానీ.. అడ్డంగా మధ్యలో కోస్తే స్టార్‌ ఆకారంలో కనిపిస్తాయి. అందుకే ఈ పండ్లను స్టార్‌ ఫ్రూట్‌ అంటారు. ఈ పండ్లను చక్రల్లాగా కోసి ఉప్పు, కారం చల్లుకుని తింటారు. ఈ పండును పోషకాల గని అని చెప్పుకోవచ్చు. ఈ పండ్లలో సి, బి2, బి6, బి9 విటమిన్లు, ఫైబర్‌, పొటాషియం, జింక్‌, ఐరన్‌లాంటి పోషకాలున్నాయి.

స్టార్‌ ఫ్రూట్‌యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, విటమిన్‌- సి పుష్కలంగా ఉండే ఈ పండ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. కామెర్లనీ తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి వేడిని తగ్గించి వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. స్టార్ ఫ్రూట్లలో విటమిన్ – ఎ, బీటాకెరటోన్లు పుష్కలంగా ఉండటం వలన గర్బిణీ స్త్రీలతో పాటు కడుపులో పెరిగే బిడ్డకు కూడా మేలు చేస్తాయి. గర్భిణీల్లో ఆకిలిని పెంచుతుంది. విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు గర్భిణీల వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది. పాలిచ్చే తల్లులు తింటే పాలు బాగా పడతాయి.

స్టార్‌ ఫ్రూట్‌శరీరంలోని అదనపు నీటిని తొలగించడానికి ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. దగ్గు, కామెర్లు, సమస్యలూ దూరమవుతాయి. కళ్ల మంటల్నీ తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి, రక్తపోటు క్రమబద్ధంగా ఉండటానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయి అదుపులో ఉంటుంది. శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయినీ నియంత్రణలో ఉంచుతుంది. అలసటనీ అజీర్తినీ జలుబు, ఫ్లూ జ్వరాల్నీ నివారిస్తాయి. కోకమ్‌, పేషన్‌ పండ్ల మాదిరిగానే ఊబకాయాన్ని తగ్గించడానికీ దోహదపడుతుంది.

స్టార్‌ ఫ్రూట్‌ఈ పండ్లలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ నివారిణిగా సహాయపడుతాయి. అలాగే శరీరంలో మలినాలను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఆటలమ్మ, తలనొప్పి, తామర వంటి వ్యాధుల చికిత్సల్లో ఈ చెట్టు ఆకులు, వేర్లను ఉపయోగిస్తారు. అయితే మూత్రపిండ లోపాలతో బాధపడుతున్న వారు ఈ పండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలో ఆక్సాలిక్‌ ఆమ్లం ఉంటుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR