చేపలు తినడం వల్ల కలిగే ఉపయోగాలేమిటో తెలుసా ?

ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాలి. అన్ని పోషకాలూ ఒకే దాంట్లో దొరికితే, ఇక వేరే పదార్థాలేవీ తినకుండా ఆ ఒక్క ఆహారమే తీసుకుంటే సరిపోతుంది. కానీ అన్ని పోషకాలు ఉండే ఆహారం ఉండదు కాబట్టి ఎక్కువ శాతం పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాంటివే చేపలు!

Health Benefits Of Fishఉత్తమ పోషకాలు ఇచ్చే మంచి ఆహారంగా చేపలను చెప్పుకోవచ్చు. మంచి ఆరోగ్యానికి కావాల్సిన నాణ్యమైన మాంసకృత్తులు చేపలలో ఉంటాయి. అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండే మాంసాహారం చేపలు మాత్రమే. చేపలను ఎలా చేసుకొని తిన్నా రుచిగానే ఉంటాయి. చేపల పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. ఏదో ఒక రూపంలో చేపలను వారంలో కనీసం 1 లేదా 2 సార్లు తీసుకుంటే అద్భుతమైన లాభాలు ఉన్నాయి.

Health Benefits Of Fishముఖ్యంగా సముద్రపు చేపలను ఉత్తమ పోషకాలు ఇచ్చే మంచి ఆహారంగా పరిగణించవచ్చు. మంచి ఆరోగ్యానికి, నాణ్యమైన మాంసకృత్తులను పొందడానికి చేపలు తినాల్సిందే. అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండే మాంసాహారం చేపలు మాత్రమే. ఈ క్రమంలో మనం కూడా చేపల వల్ల కలిగే ఉపయోగాలేమిటో తెలుసుకుందాం.

ప్రతీ రోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటాయని కొందరు వైద్యులు చెబుతుంటారు. చిన్న చేపలను ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌ అధికంగా శరీరానికి లభిస్తాయి. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి.

Health Benefits Of Fishపెద్దపేగు, మలద్వార క్యాన్సర్ల ముప్పు నుండి తప్పించుకొనేందుకు కూడా రోజూ చేపలు తినాల్సిన అవసరం ఉంది. మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్ మొదలైనవి దండిగా లభించే ఆహార పదార్థం చేప మాత్రమే.

Health Benefits Of Fishగట్టి ఎముకలకు, పళ్లకు అవసరమయ్యే ఫ్లోరిన్‌తో పాటు.. రక్తవృద్ధికి అవసరమయ్యే హీమోగ్లోబిన్‌ పెరగడానికి, అందుకు కావాల్సిన ఇనుము చేపల్లో విరివిగా లభిస్తుంది లావు, పొట్ట రాకుండా ఉండాలంటే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తినడం మంచిది అంటుంటారు. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకమని భావించవచ్చు. అలాగే చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి.

Health Benefits Of Fishగర్భిణీ స్త్రీలు చేపలు తినడం వల్ల.. కడుపులో బిడ్డకు మంచి ప్రొటీన్లు అందుతాయి. వారి మెదడు కూడా బాగా అభివృద్ధి చెందుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR