Home Health వెల్లుల్లి టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

ప్రస్తుత వైరస్ విపత్కర కాలంలో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అందుకే హెల్దిగా ఉండడానికి ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ముఖ్యంగా కరోనావైరస్ వల్ల రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుకోవాల్సిన అవరసం ఉంది. కానీ చాలా మందికి టీలేనిదే రోజు గడవదు. అందుకని ఆ టీతో ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బరువు తగ్గాలని అనుకునే వారు చేస్తున్నది టీ లు, కాఫీ లు మానేసి గ్రీన్ టీ బాట పట్టారు. మరికొందరు బ్లాక్ టీ కూడా తాగేస్తున్నారు. ఇంకొందరు మరికొంచెం ముందుకు వెళ్లి జామ ఆకులతో, గులాబీ రేకులతో, మందారం పూవులతో టీ లు తయారు చేసుకుని తాగేస్తూ ఉన్నారు.

Health Benefits of Garlic Teaవీటివల్ల ఫలితాలు ఎంత వరకు ఉన్నాయనేది పక్కన పెడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు కాబట్టి ఏ విధమైన భయం లేదు. అయితే ఆయుర్వేద పరంగా శరీరంలోని అన్ని జబ్బులను అసమతుల్యతలను తరిమి కొట్టే ఒక అద్భుతమైన పదార్థం ఉపయోగించి తయారు చేసే ఒక టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.భారతీయ వంటకాల్లో వెల్లుల్లి వినియోగం విరివిగా జరుగుతుంది. వెల్లుల్లి ఆహార పదార్ధాల రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యాని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే నార్మల్ టీ తాగడానికి బదులు వెల్లుల్లి టీ ప్రయత్నించండి. దీని వల్ల కలిగే ఆరోగ్యపరమైన లాభాలు అన్నీ ఇన్నీ కావు.

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ మీద బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత దించి ఒక గ్లాస్ లో వేయాలి. ఇపుడు వెల్లుల్లి రెబ్బలను మరీ మెత్తగా కాకుండా కేవలం రెండు మూడు దెబ్బలు వేసి కాసింత దంచాలి. ఈ వెల్లుల్లి రెబ్బలను వేడి నీటిలో వేసి గ్లాసు మీద మూత పెట్టాలి. నీరు గోరు వెచ్చగా అయినపుడు అందులో ఉన్న వెల్లుల్లి రెబ్బలు తీసివేయాలి. ఇపుడు ఆ నీటిలో ఒక స్పూన్ తేనె, సగం కాయ నిమ్మరసం పిండుకోవాలి. అంతే వెల్లుల్లి టీ రెడి అయినట్టే.

వెల్లుల్లి లేదా ఎల్లిగడ్డ శరీరానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. అందుకే నిత్యం మనం కూరల్లో వెల్లుల్లిని వేసుకుంటాం. వెల్లుల్లి క్లోమ గ్రంధిలో ఉండే బీటా కణాలను ఉత్తేజితం చేస్తుంది. దాని వల్ల శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది. బిపిని నియంత్రించడంలో వెల్లుల్లి పాత్ర ఉంటుందని చెబుతారు.

ఖాళీ కడుపుతో వెల్లుల్లి టీ తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో పాటు జీర్ణ శక్తి పెంచడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్న విషతుల్యాలు తొలగించడంలో వెల్లుల్లి టీ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకుంటున్న వారికి వెల్లుల్లి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లి టీ వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. శరీరంలో రక్తప్రసరణను పెంచడంలో ఉపయోగపడుతుంది.

ఇందులో ఉన్న నిమ్మకాయ రసంలో సిట్రస్ రోజు మొత్తం ఉత్సాహంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది, అలాగే యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల దీర్ఘ కాలం వాడితే యవ్వనాన్ని చెక్కు చెదరనివ్వదు. తేనె సహజమైన చెక్కరలు కలిగి ఉండటం వల్ల శరీరంలో సమతా స్థాయిని ఉంచుతుంది. చర్మానికి మృధుత్వాన్ని, తేమను అందిస్తుంది. రోజంతా చురుగ్గా ఉండటంలో తేనె కూడా సహాయపడుతుంది.

కరోనా సమయంలో చిన్నగా దగ్గు వచ్చినా అనుమానిస్తున్నారు. అలా అని పెరుగుతున్న కేసులకు బయపడి ఆసుపత్రులకు వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో భారీగా ఖర్చులు ఏమీ చేయకుండా.. ఇంట్లో ఉండే సాధనాలతోనే ఆరోగ్యంగా మారే అవకాశం ఉంది. ఇలా చేస్తే ప్రతీ ఇల్లు ఆరోగ్యానికి కేంద్రంగా మారుతుంది.

 

Exit mobile version