గసగసాలు వల్ల ఆరోగ్యానికి కలిగే మేలేంటో తెలుసా ?

మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి గసగసాలు. వీటినే గసాలు అని కూడా అంటారు. తెల్లగా, చిన్నగా ఉండే గసగసాల్ని ఈ రోజుల్లో మనం వంటల్లో వాడుతున్నాం గానీ పూర్వం వాటిని మందుల తయారీలో వాడేవాళ్లు. గసగసాలు నుండి నల్ల మందును తయారుచేస్తారు. మిగతా సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి. గసగసాలు కూరలకు ఎంతో టేస్ట్ ఇస్తాయి. కుర్మా లాంటి వాటిలో గసగసాల్ని వేయడం ద్వారా ప్రత్యేక రుచి, కమ్మదనం వస్తుంది. మరి వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే మేలేంటో తెలుసుకుందాం.

health benefits of Gasagasalu->తలనొప్పి నయం కావడం నుండి ఉబ్బసం వరకు చాలా సమస్యలను తగ్గించే శక్తి గసగసాలలో ఉంది. ఈ విత్తనాలలో ఇనుము, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, రాగి, మెగ్నీషియం మరియు జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. గసగసాలలో ఉండే మాంగనీస్ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

health benefits of Gasagasalu->గసగసాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, బలపరుస్తుంది. అంతేకాదు. మలబద్ధకం చికిత్సలో కూడా ఇవి బాగా సహాయపడతాయి. గసగసాలలో అధికంగా ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

health benefits of Gasagasalu->గసగసాలు చలువ చేసే గుణాన్ని కలిగి వుంటాయి. తరచు వేడి చేసేవారు వీటిని వాడటం వలన వేడి తగ్గుతుంది. విరేచనాలు అవుతున్నప్పుడు గసగసాలను దోరగా వేయించి నీటితో కలిపి నూరి ఆ రసాన్ని తేనెతో గాని లేక పంచదారతో కాని తీసుకోవాలి.

health benefits of Gasagasalu->నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వలన మంచి నిద్ర సొంతం అవుతుంది. గసగసాలు ఎక్స్పోక్టోరెంట్ మరియు సిమల్సేంట్ గుణాలను కలిగి ఉన్నందువలన శ్వాస సంబంధిత రుగ్మతలు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా దగ్గు మరియు దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తాయి.

health benefits of Gasagasalu->గసగసాల్లో డే జింక్ కంటెంట్, యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మాక్యులర్ డీజెనరేషన్ వంటి కంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి.

health benefits of Gasagasalu->గసగసాలు ఎక్స్పెక్టోరెంట్, సిమల్సేంట్ వంటి శ్వాస సమస్యలను నయం చేసే గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి.

health benefits of Gasagasalu->గసగసాల్లోని జింక్ థైరాయిడ్‌ను నయం చేయడంలో చాలా సహాయపడుతుంది. వీటిలోని జింక్ థైరాయిడ్ గ్రంధులకు ఒక వరంగా పనిచేస్తుంది, థైరాయిడ్ పనితీరును నియంత్రిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR