Home Health నెయ్యి ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుందో తెలుసా ?

నెయ్యి ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుందో తెలుసా ?

0

పురాతన కాలం నుండి కూడా భారతీయుల జీవన శైలిలో నెయ్యి భాగంగా ఉంది. భారతీయ సాంప్రదాయ వంటలలో నెయ్యి ది చాలా ముఖ్యమైన పాత్ర. దీన్ని నిత్యం అనేక వంట‌కాల్లో వాడుతుంటారు. కొంద‌రు నెయ్యిని నేరుగా భోజ‌నంలో తీసుకుంటారు. ఇది ఆహార పదార్థాలతో పాటు కలిపి తింటే మరింత రుచిని అందిస్తుంది. అద్భుత‌మైన రుచి క‌లిగే ఉండే నెయ్యిలో ఎన్నో పోష‌క విలువ‌లు దాగి ఉన్నాయి. విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, యాంటీఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ఉన్న నెయ్యి ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ద‌రిచేర‌కుండా చేయ‌గ‌ల‌దు.

నెయ్యినెయ్యి కేవలం మన వంటల్లోనే కాకుండా మన ఆచారవ్యవహారాల్లో కూడా ఎక్కువ వాడేవారు. దేవుడిని ఆరాధించడానికి ఉపయోగించే పంచామృతంలో భాగంగా నెయ్యిని వాడతారు. ఆవు నెయ్యిని ఉపయోగించి దీపాన్ని వెలిగిస్తారు. దేవుడికి పవిత్రంగా సమర్పించే హోమాలు, అగ్నిహోత్రయాలలో నెయ్యిని వాడతారు. అన్ని ఆచారాల్లో నెయ్యి ప్రధానంగా ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యంలో నెయ్యిని ఎక్కువగా వాడుతారు. ఆరోగ్యానికి మేలు చేయడంలో నెయ్యి ముందు వరుసలో నిలుస్తుంది.

అంతేకాదు నెయ్యి బరువు తగ్గడానికి, బొడ్డు దగ్గర ఉండే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. భారతీయ శాస్త్రమైన ఆయుర్వేదంలో నెయ్యిని ఎన్నో రకాల మందుల తయారీకి వాడేవారు. దీర్ఘకాల వ్యాధులను నయంచేసే లక్షణాలు ఎన్నో నెయ్యికి ఉన్నాయి. అయితే నెయ్యి కేవ‌లం ఆరోగ్య ప‌రంగా కాకుండా, సౌంద‌ర్య ప‌రంగానూ ఉప‌యోగ‌ప‌డ‌తుందట. నెయ్యితో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను కూడా న‌యం చేసుకోవ‌చ్చట. ముఖ్యంగా చ‌ర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మెరిపించ‌డంలో నెయ్యి సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యికీ సౌందర్యానికి దగ్గర సంబంధం ఉంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ కి కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. చర్మానికి మంచి మెరుపునిస్తాయి. నెయ్యి ఫేస్ మాస్క్ తో మృదువైన మెరిసే చర్మం మీ స్వంతం చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచేయండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే బాగా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

ఒక బౌల్‌లో తీసుకుని అందులో నెయ్యి, శెన‌గ‌పిండి మ‌రియు పాలు వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి. ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ పోయి కాంతివంతంగా మారుతుంది. దానితో పాటు పాలలో నెయ్యి కలుపుకోని తాగడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో సహజమైన మాయిశ్చరైజర్ ఉంటుంది. కావున ఇది మీ చర్మం మెరిసేలా చేస్తుంది.

స్నానం చేయ‌డానికి ముందు శ‌రీరానికి లేదా ముఖానికి నెయ్యిని రాసుకుని త‌రువాత స్నానం చేస్తే పొడి చ‌ర్మం కాస్తా మృదువుగా మారుతుంది. తేమ‌గా ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న‌వారికి ఈ టిప్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే డ్రై స్కిన్‌తో ఇబ్బంది ప‌డుతున్న వారు నెయ్యి మ‌రియు బాదం ఆయిల్ రెండూ స‌మానంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రామాన్ని స్నానం చేసే పావు గంట ముందు ముఖానికి, మెడ‌కు అప్లై చేసేసి ఆర‌బెట్టుకోవాలి. అనంత‌రం స్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల‌ ముఖం మృదువుగా మ‌రియు తేమ‌‌గా మారుతుంది.

నెయ్యి, గ్లిజరిన్ కూడా చర్మానికి సరైన హోమ్ రెమెడీసే. 2 టీస్పూన్ నెయ్యి, నాలుగు చుక్కలు గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకుంటే మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇది మీ చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. రాత్రి పూట ముఖానికి కొద్దిగా నెయ్యి రాసి మరుస‌టి రోజు ఉద‌యాన్నే క‌డిగేయాలి. దీంతో ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోతాయి.

నిత్యం నెయ్యిని ముఖానికి రాయ‌డం వ‌ల్ల య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌కుండా ఉంటాయి. ఇందుకు గాను అర టేబుల్ స్పూన్ నెయ్యిని, అంతే మొత్తంలో తేనెకు క‌లిపి ముఖానికి రాయాలి. 18-20 నిమిషాల పాటు ఉంచి త‌రువాత గోరు వెచ్చని నీటితో క‌డిగేయాలి. ముఖంపై ఏర్ప‌డే ముడ‌త‌ల‌కు, మ‌చ్చ‌ల‌కు ఈ చిట్కా అద్భుతంగా ప‌నిచేస్తుంది.

ఇక క‌ళ్ల చుట్టు ఉండే న‌ల్ల‌టి వ‌ల‌యాలను నివారించ‌డంలోనూ నెయ్యి ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌తి రోజు నిద్రించే ముందు కొద్దిగా నెయ్యి తీసుకుని క‌ళ్ల చుట్టు అప్లై చేసి మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి. ఉద‌యం లేవ‌గానే చ‌ల్ల‌టి నీటితో క‌ళ్ల‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే న‌ల్ల‌టి వ‌ల‌యాలు త‌గ్గుముఖం ప‌ట్టి క‌ళ్లు ప్ర‌కాశ‌వంతంగా మార‌తాయి.

పొల్యూషన్, సన్‌రేస్, దుమ్ము, పొగ వల్ల పెదవులు వాటి నాచురల్ పింక్ కలర్ ని పోగొట్టుకుంటాయి. పెదాలు తిరిగి అందంగా కనిపించాలంటే చేయవలసిందల్లా కొద్దిగా నెయ్యి వేడి చేసి రాత్రి నిద్రకి ముందు ఆ నెయ్యిని పెదవులకి అప్లై చేయడమే. మీరు నిద్ర లేచేప్పటికి మీ లిప్స్ పైన డ్రై ఫ్లేక్స్ కనబడతాయి. వాటిని స్క్రబ్ చేసేయండి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే పెద‌వులు అందాన్ని సంత‌రించుకుంటాయి. మృదువుగా మారుతాయి.

ముఖం లేదా శ‌రీరంపై ఎక్క‌డైనా కాలిన గాయాలు, పుండ్లు ఉంటే ఆయా భాగాల్లో నెయ్యి రాస్తే అవి త్వ‌ర‌గా మానిపోతాయి. అలాగే జుట్టును పట్టులా చేసేందుకు నెయ్యి బాగా పని చేస్తుంది. డ్రై, ఫ్రిజ్జీ హెయిర్ కి నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మంచి కండిషనర్ లా పని చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకి అప్లై చేయండి. ఇరవై నిమిషాలు అలాగే ఉంచేసి తరువాత కడిగేయండి. ఈ ప్యాక్ జుట్టుని సాఫ్ట్ గా మ్యానేజ్ చేసేందుకు వీలుగా చేస్తుంది. నెయ్యిలో నిమ్మరసం కలిపి చుండ్రుని ట్రీట్ చేయడానికి కూడా వాడవచ్చు.

 

Exit mobile version