బూడిద గుమ్మడికాయ వలన ఆరోగ్యానికి ఎంత లాభమో తెలుసా ?

దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం. ఈ గుమ్మడిలో ఔషధ గుణాలూ ఎన్నో ఉన్నాయి. బూడిద గుమ్మడి కాయలోనూ విత్తనాల్లోనూ తీగలోనూ కూడా ఔషధ గుణాలున్నాయని వైద్యులు అంటారు. కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం, దాహం ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. అలాగే మలబద్దకంతో బాధపడే వాళ్ళు రోజూ బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్దకం తగ్గుతుందట.

Health Benefits of Pumpkinఅంతేకాదు ఈ విత్తనాల నుంచి తీసిన నూనెని చర్మవ్యాధుల నివారణలో వాడుతుంటారు. ఇంకా బూడిద గుమ్మడి తీగ రసాన్ని హై బిపి, నిద్రలేమితో బాధపడేవారికి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. అంతేకాదు… బరువు కూడా తగ్గిపోవచ్చు. బూడిదగుమ్మడి కాయ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి వడియాలు మాత్రమే. కానీ చలికాలంలో పిందె తొడిగి, వేసవి వరకూ పెద్దపెద్ద కాయలు కాసే ఈ గుమ్మడితో పసందైన వంటకాలెన్నో చేసుకోవచ్చు ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందట:

Health Benefits of Pumpkinముఖ్యంగా హార్ట్ డిసీజ్ మరియు మాస్క్యులర్ డీజనరేషన్ వంటి సమస్యలను నివారిస్తుంది . మరి రెగ్యులర్ డైట్ లో గుమ్మడిని చేర్చుకోవడం వల్ల మరిన్ని ఇతర ప్రయోజనాల పొందవచ్చు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

Health Benefits of Pumpkinగుమ్మడిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్దం చేస్తుంది . ఇందులో ఉండే లాక్సేటివ్ గుణాల వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. హైబిపి తగ్గిస్తుంది. గుమ్మడి జ్యూస్ హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే పెక్టిన్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

వ్యాధినిరోధకత పెంచుతుంది :

Health Benefits of Pumpkinగుమ్మడిలో ఉండే విటమిన్ సి మరియు మినిరల్స్ వ్యాధినిరోధకతను పెంచడంలో బాగా సహాయపడుతుంది.

కూలింగ్ ఏజెంట్:

గుమ్మడి జ్యూస్ శరీరానికి అవసరం అయ్యేంత చల్లదనాన్ని అందిస్తుంది. బాడీ హీట్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

ఆర్టియోస్కేర్లోసిస్ ను నివారిస్తుంది:

Health Benefits of Pumpkinగుమ్మడి జ్యూస్ క్లెన్సర్ గా పనిచేస్తుంది మరియు ఆర్టిరియల్ డిపాజిస్ట్ ను తగ్గిస్తుంది, దాంతో హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటివాటిని నివారించుకోవచ్చు.

గుమ్మడి జ్యూస్ కిడ్నీ మరియు గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారిస్తుంది:

Health Benefits of Pumpkinగుమ్మడి జ్యూస్ కిడ్నీ మరియు గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించడంలో సహాయపడుతుంది . రోజులో మూడు గ్లాసుల గుమ్మడి జూస్ త్రాగడం వల్ల బ్లాడర్ స్టోన్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది.

సెడటివ్ గా పనిచేస్తుంది:

Health Benefits of Pumpkinనిద్రలేమిని నివారించడంలో గుమ్మడి చాలా సహాయపడుతుంది. గుమ్మడి జ్యూస్ తో పాటు తేనె మిక్స్ చేసి త్రాగడం వల్ల నిద్రలేమి సమస్యను నివారించుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR