Home Health గ్రీన్ ఆపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా ?

గ్రీన్ ఆపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా ?

0

రోజూ ఓ ఆపిల్ తీసుకుంటే వైద్యుడిని సంప్రదించే అవసరమే ఉండదని అంటారు. అయితే ఆపిల్ అనగానే మనకు ఎరుపు రంగులో వుండే ఆపిల్సే గుర్తుకువస్తాయి. కానీ గ్రీన్ ఆపిల్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రీన్ ఆపిల్స్ మధుమేహంను నిరోధిస్తుంది. విటమిన్ ఎ, బి, సి వీటిలో వుండటం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

Health Benefits of Green Applesమహిళల్లో ఒత్తిడి శాతం పెరిగినప్పుడు అది క్రమంగా మైగ్రేన్‌ తలనొప్పిగా మారుతుంది. అటువంటి మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడుగా ఆకుపచ్చని యాపిల్స్‌ చక్కగా పనిచేస్తాయి. అంతేకాకుండా గ్రీన్ యాపిల్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపర్చడానికి సహాయపడుతుంది. తద్వారా జీవక్రియను పెంచుతుంది.

గ్రీన్ యాపిల్స్‌లో ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం వంటి తదితర ఖనిజాలు వుంటాయి. ఇందులో వుండే ఇనుము రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక జీవక్రియ రేటు పెంచుతుంది. బరువు తగ్గాలనునుకునేవారికి గ్రీన్ యాపిల్ మంచి ఆహారం.

చర్మ కేన్సర్ నిరోధించే గుణాలు ఇందులో ఉన్నాయి. దీనిలో విటమిన్ సి ఫ్రీ రాడికల్స్ ద్వారా కణాలకు వాటిళ్లే నష్టాన్ని నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌లు కణజాల పునర్నిర్మాణం, పునరుత్తేజానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్‌లు కాలేయం రక్షించి, సక్రమంగా పనిచేయడానికి తోడ్పాటునందిస్తాయి. అంతేకాదు ఎముకల నిర్మాణానికి సాయపడి కీళ్ల వ్యాధులను నిరోధిస్తుంది, థైరాయిడ్ గ్రంథి సమస్యలను తగ్గిస్తుంది.

రోజూ ఒక గ్రీన్ యాపిల్ తింటే అల్జీమర్ వ్యాధిని అడ్డుకోవచ్చు. ఇది మెదడులోని ఎసిటైల్‌ కోలీన్‌ స్రావాన్ని పెంచి, న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మెరిపించడంలో కూడా కూడా సహాయపడతాయి.

Exit mobile version