జామ పండుతో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ?

ఆరోగ్యకరమైన జీవితానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. అందులో తాజా పండ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వివిధ రకాల పండ్లలో ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. అలాంటి పండ్లలో జామ పండు ఒకటి. తినడానికి ఎంతో రుచిగా ఉండే ఈ జామ పండులో ఉండే చిన్న చిన్న గింజలను కూడా తినవచ్చు. సీజన్స్ తో సంబంధం లేకుండా ఏ సీజన్ లో అయినా అందుబాటులో ఉండే ఈ పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మిగిలిన పండ్లతో కంపేర్ చేసుకుంటే రేటు కూడా తక్కువే.. ధర తక్కువేమో కానీఇది తినటం వలన కలిగే ప్రయోజనాలు బోలెడు… జామకాయ అనేది చాలా సాధారణమైన పండు. కానీ దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఇది ఓ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఈ పండు చక్కెరలు, విటమిన్లు , ఖనిజాలు, ఔషధ లక్షణాలకు ప్రసిద్ధి. జామ పండ్లు ఆరోగ్యానికీ ఎన్నో లాభాలను అందిస్తాయి. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అందించే జామ పండుతో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఇపుడు తెలుసుకుందాం..

health benefits of guavaజామ పండులో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి విటమిన్ ఎ చాలా అవసరం. కాబట్టి.. జామ పండు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి సమస్యలను నివారించి, కంటి చూపును మెరుగుపరుస్తుంది. జామపండులో లభించే అధిక యాంటీ ఆక్సిడెంట్స్.. ఫ్రీ రాడికల్స్ నుండి కళ్ళను రక్షించడంలో సాయపడుతుంది. మరియు రెటీనా దెబ్బతినకుండా రక్షిస్తుంది. తద్వారా దృష్టిని మెరుగుపరుస్తుంది. కంటిశుక్లం, మాక్యులర్ క్షీణతను తగ్గించడంలోనూ సాయపడుతుంది. చాలా మంది జామ పండును ఇష్టంగా తింటారు. ముఖ్యంగా జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల అందరికీ ఈ పండంటే చాలా ఇష్టం. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉండి పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో అధికంగా లభించే పోషకాలు. డయాబెటీస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన పండులో ఇది ఒకటి.

health benefits of guavaఇక జామపండు గర్భిణీలకు చాల మేలు చేస్తుంది. ఇది తల్లికి, గర్భంలో ఉన్న శిశువుకి మంచి పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా జామ పండులో ఫోలిక్ ఆసిడ్, విటమిన్ బి -9 ఉంటుంది. ఇది శిశువు నాడీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సాయపడుతుంది. కాబట్టి గర్భిణీలకు జామ పండు ఆరోగ్యకరమైనది. ఇది నవజాత శిశువును నాడీ సంబంధిత రుగ్మతల నుంచి కాపాడుతుంది.

health benefits of guavaజామ పండులోని ఉండే మరో అద్భుతమైన గుణం ఏంటంటే… ఈ పండు కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండు క్యాన్సర్ కణాల అభివృద్ధిని తగ్గించేందుకు గొప్ప ఔషధంగా పని చేస్తుంది. జామ పండులో ఉండే లైకోపీన్, క్వెర్సెటిన్, విటమిన్ సి, ఇతర పాలీఫెనాల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, ఇవి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా కాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో కూడా ఇది సాయపడుతుంది. జామ పండు ప్రోస్టేట్ కాన్సర్, రొమ్ము కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

health benefits of guavaజామ పండు ఆరోగ్యానికే కాదు సంతానలేమి సమస్యలకు ఒక దివ్య ఔషధం అని చెప్పాలి… ఇందులోని పోషకాలు సంతాన సమస్యలను దూరం చేస్తాయి. ఇది సంతానోత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పొటాషియం బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఈ పండులో 80% నీరు ఉంటుంది. ఇది మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. అనేక దంత సమస్యలను నివారిస్తుంది. జామ పండు శక్తివంతమైన రోగ నిరోధక చర్యను కలిగి ఉంది మరియు శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ ‌గా పనిచేస్తుంది. ఇది సూక్ష్మక్రిములను చంపుతుంది. జామ పండు రసం పంటి నొప్పి, చిగుళ్ళు వాపు, నోటి పూతలను నయం చేస్తుంది. ఈ పండులో విటమిన్ సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్స్, మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మనం తినే ఆహారం నుండి ఇతర కీలక పోషకాలను గ్రహించడానికి శరీరానికి సహాయపడతాయి..

health benefits of guavaజామ పండులో ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ సి, కెరోటిన్, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయ. అందువలన జామ చర్మ సంరక్షణలో జామకాయ కీ రోల్ పోషిస్తుంది, అంతేకాకుండా వృద్ధాప్యాన్నివృద్ధాప్యాన్ని తగ్గించి మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. అందువల్ల జామ పండును సౌందర్య సంరక్షణ లోషన్స్ తయారీలో వాడతారు. మరి ఇన్ని అద్భుత ప్రయోజనాలున్న జామపండును డైలీ తీసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR