వెదురు ఆకుల కషాయం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే కప్పు ఛాయ్ కడుపులో పడకపోతే కొంతమందికి రోజు స్టార్ట్ అవ్వదు. క‌డ‌క్ ఛాయ్, మ‌సాలా ఛాయ్, అల్లం ఛాయ్.. ఇలా ర‌క‌ర‌కాల ఛాయ్‌ల‌ను వేడివేడిగా చాలాసార్లు తాగి ఉంటారు. వెదురు ఆకులతో చేసిన గుమగుమలాడే టీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. అస‌లు దీని గురించి విన్నారా ..? అలాంటి ఓ స్పెష‌ల్ టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే చెట్టు వెదురు చెట్టు. రోజుకూ 50 సెంటీమీటర్లు పెరిగేస్తుంది. ఈ చెట్టు నాలుగేళ్లపాటూ పెరిగితే దీని నుంచి అద్భుతమైన వెదురు కలప వస్తుంది. దాంతో ఫర్నిచర్, బాస్కెట్లు, మ్యాట్స్, పేబర్, బీర్ సహా చాలా తయారుచేస్తారు. వెదురు ఆకుల టీ… థాయిలాండ్, కొరియా, తైవాన్, జపాన్, ఈశాన్య ఇండియాలో పేరు తెచ్చుకుంది.

వెదురు ఆకుల కషాయంవెదురు ఆకుల నుంచి మంచి రుచి క‌లిగిన‌ టీ తయారు చేస్తున్నారు త్రిపురకు చెందిన గిరిజన వ్యాపారి సమీర్ జమాతియా. ఈ పానీయానికి ఛాయ్ ప్రియులు సహా ఇతర రాష్ట్రాల్లోని వర్తకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని దేశంలోనే కాదు, విదేశాల్లోనూ విక్రయించేందుకు వారు ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. చాలా మందికి వెదురు ఆకులతో టీ తయారుచేసి తాగుతారని తెలియదు. కానీ ఆ టీతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఇకపై ఆ టీనే తాగే చాన్స్ ఉంది.

వెదురు ఆకుల కషాయంచైనా సాంప్రదాయ మందుల్లో వెదురును వాడేవారు. వెదురు ఆకులను మరగబెట్టి టీ తయారుచేసేవారు. ఈ ఆకులు ముదిరినవి కాకుండా లేత ఆకుల్ని వాడుతారు. ఈ టీ తేలిగ్గా ఉంటుంది. తియ్యగా ఉంటూనే గడ్డి వాసన వస్తుంది. మొత్తంగా గ్రీన్ టీ లాగా ఉంటుంది. ఇందులో కెఫైన్ అన్నదే ఉండదు కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

వెదురు ఆకుల కషాయంవెదురు ఆకుల నుంచి సిలికా అనే ఖనిజం లభిస్తుంది. ఇది మన శరీరంలోని ఎముకల్ని బలంగా చేస్తుంది. జుట్టు బాగా పెరగాలన్నా, చర్మం కోమలంగా మారాలన్నా కాలి, చేతి వేళ్ల గోళ్లు ఆరోగ్యంగా, బలంగా అవ్వాలన్నా వెదురు ఆకుల టీ తాగాలి. ఇప్పుడు జుట్టు బాగా పెరగడానికి కాస్మెటిక్ కంపెనీలు వెదురు ఆకుల్ని వాడి షాంపూలు తయారుచేస్తున్నాయి.

వెదురు ఆకుల కషాయంఅల్జీమర్స్, మతిమరపు అనేవి లేనిపోని సమస్యలు. అవి వచ్చాయంటే వాటిని తగ్గించుకోవాలి అనే విషయం కూడా గుర్తుండదు. ముఖ్యంగా ఆల్జీమర్స్ ప్రమాదకరం… భోజనం తింటూనే… తినడం కూడా మర్చిపోతారు. 60 ఏళ్లప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. అది రాకుండా అడ్డుకోవాలంటే… వెదురు ఆకుల టీ రెగ్యులర్‌గా తాగితే సరి. వెదురు ఆకుల టీలో యాంటీఆక్సిడెంట్స్ ఫుల్లుగా ఉంటాయి. అంటే ఫెనోల్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సీ, ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అడ్డమైన రోగాలు రానివ్వవు. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఆపగలవు. కణాలను పాడవకుండే చేసే అద్భుత శక్తి వీటికి ఉంది. ఈ ఆకుల్లో సెలెనియం, ఐరన్, కాపర్ (రాగి), జింక్, మాంగనీస్ ఉన్నాయి. ఇవి కూడా వ్యాధుల నుంచి కాపాడుతాయి.

వెదురు ఆకుల కషాయంవెదురు పురాణకాలం నుంచీ మానవునికి అత్యంత చేరువలో ఉండి ఎన్నో విధాలుగా ఉపయోగంలో ఉంది. వైద్యపరంగా వెదురు చాలా ఉపయోగపడుతుంది. దీని లేత చిగుళ్ళతో తయారు చేసిన కషాయం సేవిస్తూ వుంటే శరీరానికి మంచి చలువ చేస్తుంది. మధు మేహానికీ, కఫం, మూల వ్యాధి నివారణకి, ఆయుర్వేదపరంగా ఎంతో ఉప శమనాన్ని ఇస్తుంది. రక్త శుద్ధిని కలిగిస్తుంది. మహిళలకు గర్భశుద్ధిని కలిగించి గర్భ కోశ వ్యాధులు రాకుండా అరి కడుతుంది. చైనీయులు ఈ వెదురుని అంటువ్యాధులు నిర్మూలించే ఔషధంగా వినియోగిస్తారు. దీనిలో పొటాషియం అత్యంత అల్పంగా ఉంటుంది. వెదురు తీపిదనం కలిగి ప్రొటీనులు, ఆయుర్వేద గుణాలు కలిగివుందంటే చాలామందికి నమ్మసఖ్యంగా ఉండదు. భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో వెదురుని బాన్‌సులోచన్‌ అంటారు. దీనినే తబషిర్‌ అని, తవషిర్‌ అని యునానీ వైద్య విధానాల్లో వినియోగిస్తూవుంటారు. దీనినే ఆంగ్లంలో బాంబూ మన్నా అని వ్యవహరిస్తూ, ఊపిరితిత్తులవ్యాధికి టానిక్ గా ఉపయోగిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR