Home Health పనస పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పనస పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0
Health Benefits of Jackfruit

తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనవలు బొమ్మరాళ్లు అంటూ ఈ పండు చుట్టూ ఒక పొడుపు కథనే అల్లేసారు. అదే పనస పండు. పనస పండులో ఓ పస ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే మనమూ గుర్తిస్తున్నాం.. పాశ్చాత్య దేశాలు కూడా పనసను మనసారా ఆస్వాదించడం మొదలు పెట్టాక ఆ పండు విలువ ఆకాశమే హద్దుగా సాగిపోయింది.

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ వేసవి కాలం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆహార నియమాలు పాటించాలి. ముక్యంగా పనసపండు ఈ సమయంలో సంజీవనిగా ఉపయోగపడుతుంది.

పచ్చి పనస కాయలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండ్లను తీసుకోవచ్చు. ముఖ్యంగా రైస్‌కు బదులు పనస పండ్లను తిన్నట్లయితే.. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

పనస పండులో సహజసిద్ధ చక్కెర్లు, ఫైబర్ ఉంటాయి. మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది. అలాగే, మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది.

పనస పండు వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయనే ఉద్దేశంతో ఔషదాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపొద్దు. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే న్యూట్రీషియన్లు లేదా వైద్యుల సూచన తీసుకోండి.

  • పనన పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి.
  • పనస పండులో ఉండే పొటాషియం తో గుండెపోటును దూరం చేసుకోవచ్చు.
  • పనసలో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్‌-C, విటమిన్‌-A పుష్కలంగా ఉంటాయి.
  • పెద్ద ప్రేగు (కోలన్) క్యాన్సర్‌ను దూరం చేసే యాంటీ-యాక్సిడెంట్లు ఈ పండులో ఉన్నాయి.
  • ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్నిస్తుంది.
  • పనస పండు అనీమియాను దూరం చేస్తుంది.
  • పనసలోని విటమిన్-A మెదడు నరాలను బలపరుస్తుంది.
  • పనస అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.
  • పనస కంటి దృష్టిని మెరుగు పరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
  • వీర్యవృద్ధికి పనస పండు సహకరిస్తుంది.
  • వాత, పిత్త వ్యాధులు నయమవుతాయి.
  • పనసలోని ఫైబర్ పైల్స్‌ను నివారిస్తుంది.
  • పనస లేత తొనల్ని వేయించి తీసుకుంటే పిత్తం తొలగిపోతుంది.
  • ఏదైనా సరే మితంగా తినాలి. ఇన్ని ప్రయోజనాలు ఇస్తుందనే ఉద్దేశంతో అతిగా ఈ పండును తింటే కొత్త సమస్యలు వస్తాయి.
  • పనస పండు నుంచి వచ్చే రబ్బరు పాల వల్ల అలర్జీకి గురయ్యే అవకాశం ఉంది.
  • రక్త సమస్యలు ఉన్నవారు పనస పండ్లను తీసుకోకపోవడమే ఉత్తమం.
  • శస్త్ర చికిత్స పొందినవాళ్లు, అధికంగా ఔషదాలు తీసుకొనేవాళ్లు పనస పండ్లను తక్కువగా తీసుకోవాలి.
  • పనస గింజల్లో ఉండే లెక్టిన్లు రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తాయి. అయితే, రోగ నిరోధక శక్తి చికిత్స పొందె రోగులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

Exit mobile version