కాకరకాయ టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అమ్మలంతా మన చేత బలవంతంగా తినిపించాలని చూసే కూరగాయలలో కాకరకాయ ఒకటి. సాధారణంగా చాలామంది అంతగా ఇష్టపడని కూరగాయలలో ఇది కూడా ఉంటుంది. అతి కొద్దిమంది మాత్రమే దీనిపై మక్కువను కలిగి ఉంటారు. అయితే మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మాత్రం మనందరికీ తెలుసు. అందుకే ఈ కూడా వండేటప్పుడు చేదుని తగ్గించేందుకు అనేక రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తుంటారు. కొందరైతే చక్కెరను కూడా జోడిస్తుంటారు.

కాకరకాయ టీఎన్ని చేసినా కూడా దీని పట్ల విముఖత, కళ్ళల్లో చిరాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాలను జోడించడం ద్వారా కాకర కాయతో కూడా అద్భుతమైన వంటకాలు తయారు చేయగలుగుతున్నారు. అయితే, ఎంత చేదుగా ఉన్నా ఇష్టం లేకపోయినా వీటి పోషకాల ప్రయోజనాల దృష్ట్యా, వీటి వాడకం కూడా విరివిగా పెరుగుతూ ఉంది. కాకర కాయను స్మూతీస్, కాక్టేయిల్స్ వంటి వాటితో పాటు, అనేక రకాల సూప్స్ మరియు బేవరేజేస్లకు విరివిగా జోడించబడుతుంది.

కాకరకాయ టీఈ కాకర కాయ రక్తంలో చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. సహజంగా కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. ఇది ఊబకాయం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే కాకరకాయ చేదు రుచిని పక్కన పెట్టి, దీని ప్రయోజనాలను పొందేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటిదే కాకరకాయతో చేసిన హెర్బల్ టీ. కాకరకాయ టీ అంతగా ప్రాచుర్యం పొందింది కాకపోయినా, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దీన్ని ఉత్తమమైనదిగా నిపుణులు చెబుతున్నారు.

కాకరకాయ టీకటిక చేదు వల్ల కాకర కాయల కూర జోలికే వెళ్లలేకపోతుంటే ఇంకా కాకర కాయల టీని ఎలా తాగుతారు అనుకోవచ్చు. అయితే కాకర కాయలను నూనెలో నిదానంగా ఎక్కువ సేపు ఫ్రై చేస్తే చేదు పోతుంది. అప్పుడు కూర తినటానికి కమ్మగా ఉంటుంది. అలాగే కాకర కాయల టీని కూడా ఓపిగ్గా తయారుచేసి తాగితే హెల్త్ పరంగా ఎన్నో లాభాలున్నాయి. క్యాన్సర్ ని సైతం క్యాన్సిల్ కొట్టే కెపాసిటీ కాకర కాయల టీకి ఉండటం విశేషం.

కాకరకాయ టీమరి ఈ కాకరకాయ టీ ఎలా చేసుకోవాలో, దాని వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకర కాయలను ముక్కలు ముక్కలుగా కోసి ఆ ముక్కలను ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ముక్కలను ఒక గిన్నెలోని నీళ్లలో వేసి వేడిచేయాలి. పావు గంటసేపు మరిగించాలి. తర్వాత ఆ కాకర కాయల రసాన్ని వేరు చేసి దానికి తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని నిత్యం తాగితే అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడొచ్చు.

ఈ కాకరకాయ టీ పౌడర్, లేదా స్క్వాష్ రూపంలో కూడా దొరుకుతుంది. దీనిని కొన్ని ప్రాంతాలలో గోహ్యా టీ అని కూడా పిలుస్తారు. దీనిని ఇంటిలోనే సులభంగా తయారు చేయవచ్చు. కాకరకాయ జ్యూస్ లా కాకుండా, ఈ హెర్బల్ టీ తయారీలో కాకరకాయ మొక్క ఆకులు, పండ్లు మరియు విత్తనాలను కూడా ఉపయోగించవచ్చు. కాకరకాయ టీ రోజూ తాగితే బీపీ సమస్య ఈజీగా నయమవుతుంది. షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది. చెడు కొవ్వు కరిగిపోతుంది. స్థూల కాయులు సన్న బడతారు. బాడీలోని వ్యర్థ పదార్థాలన్నీ తొలిగిపోతాయి.

కాకరకాయ టీకాకర కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇతరత్రా అనారోగ్యాలు దరి చేరవు. కాకర కాయల టీ ప్రాణాంతక క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల రోజూ ఈ తేనీరు తాగితే క్యాన్సర్ జబ్బును ముందే అరికట్టవచ్చు. కాకరకాయ హెర్బల్ – టీ కూడా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, దీనికి కారణం, కాకర కాయలోని శోధనిరోధక లక్షణాలు.

స్టార్‌ ఫ్రూట్‌కాకరకాయ టీ లేదా కరేలా -టీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కళ్ళకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కాకరకాయలోని విటమిన్-ఎ, బీటా కెరోటిన్, ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అదీకాక కాకర కాయల తీగలను పెరట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఆ తీగలకు కాసే కాయలతో కూర వండుకోవచ్చు. లేదా టీ పెట్టుకొని తాగొచ్చు. పెద్దగా ఖర్చు లేకుండా వ్యాధులను నయం చేసుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR