కివీ ఫ్రూట్ తో కలిగే ఉపయోగాలు అని ఇన్ని కావు

కివీ పండు అనేది ‘యాక్టినిడియా చైనిన్సెస్’ అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. ఈ రకమైన పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. ఈ కివి పండుని ‘చైనీస్ గూస్ బెర్రీ’ అని కూడా పిలుస్తుంటారు. దీనికి ప్రధాన కారణం.. ఈ పండ్లు ఆక్రోట్ ఫలం ఆకారంలో ఉండి గూస్ బెర్రీ రుచిని పోలి ఉంటాయి. 12వ శతాబ్దం నుండే ఈ పండ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. కివీ పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది.

health benefits of kiwi fruitనారింజ, బత్తాయి వంటి పండ్లలో కన్నా ఇందులో ‘విటమిన్ సి’ రెట్టింపు మోతాదులో లభిస్తుంది. యాపిల్ కంటే 5 రెట్లు ఎక్కువ పోషకాలను ఇది కలిగి ఉంటుంది. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే దీన్ని ‘వండర్‌ ఫ్రూట్’ అని కూడా పిలుస్తారు.

health benefits of kiwi fruitకివి పండును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు.. ఆస్తమా తీవ్రత కూడా తగ్గుతుంది. కివి పండులో ఉండే పొటాషియం కారణంగా.. అనేక గుండె సమస్యలు దూరమవుతాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారు.. కివి పండుని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

health benefits of kiwi fruitసాధారణంగా పండ్లను ఆహారంగా తీసుకుంటే.. అందులోని చక్కెర శాతం మనిషి శరీరంలో ఉండే మధుమేహాన్ని ఇంకాస్త పెంచుతుంది. అయితే కివి పండులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వేరేవాటితో పోల్చితే తక్కువ స్థాయిలో ఉండడం వలన.. రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఇక ఈ పండులో ఉండే నీటి శాతం కూడా.. మధుమేహంతో బాధపడేవారు తీసుకునే డైట్‌కి సరిపోయేవిధంగా ఉంటుంది.

health benefits of kiwi fruitఅంతేకాదు కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతాయి. రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి. ఇక నిద్రలేమితో బాధపడుతున్న వారికి దీన్ని మించిన ప్రకృతి ఔషధం మరొకటి లేదు. దీనిలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్ర పడుతుంది.

health benefits of kiwi fruitకివితో ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కేశ సంరక్షణకు కివి పండు గుజ్జును షాంపూలా వాడడం వల్ల.. జుట్టు రాలిపోవడం లేదా తెల్లగా మారిపోవడం లాంటి సమస్యలు దూరమవుతాయి. కివి పండు గుజ్జుని ఫేస్ మాస్క్‌ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR