లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాటర్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

ప్ర‌తిరోజు త‌గిన మోతాదులో మంచి నీళ్లు తాగాల‌ని డాక్టర్లు సూచిస్తుంటారు. ఎందుకంటే నీరు త‌క్కువ‌గా తాగితే ఎన్నో అనారోగ్యాల‌కు దారితీస్తుంది. ముఖ్యంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. శ‌రీరం డీహైడ్రైట్ అయితే వెంట‌నే అల‌స‌ట‌గా అనిపిస్తుంది. అంతే కాకుండా త‌క్కువ నీరు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌లినాలు పేరుకుపోయి కిడ్నీలో రాళ్లు త‌యార‌వుతాయి.

లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాటర్హైడ్రేషన్ కి నీరు మంచి సోర్స్. అయితే సాధారణంగా నీళ్లు ఎక్కువగా తాగాలంటే అందరికీ ఇష్టం ఉండదు. నీటితో పాటూ ఇతర లిక్విడ్స్ నుండి కూడా హైడ్రేషన్ లభిస్తుంది. కానీ, అవన్నీ రోజూ, ఎక్కువ సార్లు తీసుకోలేం. నీరే బెస్ట్. కానీ, కొంత మందికి ప్లెయిన్ వాటర్ బోరింగ్ గా అనిపిస్తుంది.

లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాటర్వాటిని రోజంతా తీసుకోలేం కాబ‌ట్టి లెమ‌న్ ఇంఫ్యూజ్ఢ్ వాట‌ర్ తీసుకోవడం మంచిది. మంచి నీరు కంటే లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాట‌ర్ తాగ‌టం వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయ‌ట. నిమ్మ‌కాయ‌లో విట‌మిన్ సీ ఉంటుంది. ఇది ఇమ్యునిటీని పెంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతే కాకుండా గుండె స‌మ‌స్య‌లు రాకుండా కాపాడుతుంది.

లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాటర్నిమ్మకాయ‌లో ఉండే విట‌మిన్ సీ చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా కాపాడుతుంది. లేటు వ‌య‌స్సులో చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా కాపాడుతుంది. తీసుకున్న ఆహారం అర‌గ‌టానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. కాన్టిపేష‌న్ స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది. నోటి దుర్వాస‌న ను తొల‌గిస్తుంది. నాన్ వెజ్ తిన్న‌ప్పుడు నోరు ఒక‌లాంటి వాస‌న వ‌స్తుంది. అలాంటి వాస‌న రాకుండా ఉండేందుకు బోజ‌నం త‌రువాత ఒక గ్లాస్ నిమ్మ‌ర‌సం తాగితే స‌రిపోతుంది.

లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ ని ఎలా త‌యారు చేసుకోవాలి?

లెమ‌న్ ఇంఫ్యూజ్ఢ వాట‌ర్ త‌యారు చేసుకోవ‌డం చాలా తేలిక‌. ఒక నిమ్మ‌కాయ‌ను తీసుకుని చిన్న చిన్న స్లైసులుగా క‌ట్ చేయండి. ఆ త‌ర‌వాత ముక్క‌ల‌ను ఒక వాట‌ర్ బాటిల్ లో వేసుకోండి. ఆ బాటిల్ ను ఒక గంట నుండి నాలుగు గంట‌ల వ‌ర‌కు ఫ్రిజ్ లో పెట్టండి. అంతే లెమ‌న్ ఇంఫ్యూజ్ఢ్ వాట‌ర్ త‌యార‌యింది.

కేవలం లెమన్ తోనే కాదు నచ్చిన వేరే ఇంగ్రిడిఎంట్స్ తో కూడా ఇంఫ్యూజ్ఢ్ వాట‌ర్ తయారుచేసుకోవచ్చు.

1. అర కప్పు స్ట్రాబెరీ, బేసిల్ లీవ్స్ ఐదు (తుంచి వేయాలి), సన్నగా తరిగిన నిమ్మకాయ ఒకటి.

2. సన్నగా తరిగిన కుకుంబర్ ఒకటి, తుంచి వేసిన తాజా పుదీనా ఆకులు పది.

3. సన్నగా తరిగిన ఆరెంజ్ ఒకటి, చెక్కు తీసి సన్నగా తరిగిన అల్లం రెండంగుళాల ముక్క.

4. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, ఒక నిమ్మకాయ సన్నాగా తరిగినది.

5. ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు, గుండ్రంగా తరిగిన కివీ ఒకటి, గుండ్రంగా తరిగిన నిమ్మకాయ ఒకటి.

6. స్లైస్ చేసిన స్వీట్ ఆరెంజ్ ఒకటి, అర కప్పు దానిమ్మ గింజలు, తుంచి వేసిన పుదీనా ఆకులు పది.

1. బెర్రీస్ – బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రిస్, స్ట్రా బెర్రీస్… అన్నీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఇవి వయసు కనపడనివ్వకుండా చేస్తాయి.

లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాటర్2. కుకుంబర్ – కుకుంబర్ రకరకాల పద్ధతుల్లో సిస్టమ్ ని క్లీన్ చేస్తుంది. ఇది డైజెషన్ కి కూడా హెల్ప్ చేస్తుంది. టాక్సిన్స్ ని బయటకు పంపించడంలో హెల్ప్ చేస్తుంది.

లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాటర్3. కివీ – కివీ లో విటమిన్ సీ, కే, ఈ ఉంటాయి. ఇందులో ఫోలేట్, పొటాషియం, ఫైబర్ కూడా ఉంటాయి. ఇది న్యూట్రియెంట్ రిచ్ మాత్రమే కాదు, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది.

లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాటర్5. పుదీనా – ఇది కూడా చాలా పాప్యులర్ ఇన్‌గ్రీడియెంట్. ఎందుకంటే, ఇది డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది.

లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాటర్6. ఆరెంజ్ – ఆరెంజ్ లో సీ విటమిన్ ఒక్కటే కాదు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించే గుణం కూడా ఉంది. ఇది ఒక హార్ట్ ఫ్రెండ్లీ ఫ్రూట్.

లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాటర్నిమ్మకాయ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సీ ఎక్కువగా వుంటుంది. ఇది ఒక ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్, ఇది ఫ్రీ ర్యాడికల్స్ జరిపే డ్యామేజ్ నుండి కణాలను రక్షిస్తుంది. విటమిన్ సీ ఇంకా బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది, కార్డియోవాస్క్యులర్ డిసీజ్, స్ట్రోక్ వచ్చే రిస్క్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. నిమ్మకాయల్లో ఉండే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ వెయిట్ గెయిన్ ని రెడ్యూస్ చేస్తాయని పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

లెమ‌న్ ఇంఫ్యూజ్డ్ వాటర్కొంత మంది కాన్స్టిపేషన్ రాకుండా పొద్దున్నే నిమ్మ నీరు తాగుతారు. ఇది డైజెస్టివ్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఫలితంగా మీరు తీసుకున్న ఆహారం పూర్తిగా అరుగుతుంది, అంటే ఆ ఆహారం లో ఉన్న పోషకాలన్నీ మీకు అందుతాయి, మలినాలన్నీ తొలగిపోతాయి. ఉల్లి, వెల్లుల్లి, చేపలు వంటివి తిన్న తరువాత నోరు ఒకలాంటి వాసన వస్తుంది. ఈ వాసన రాకుండా ఉండాలంటే భోజనం తరువాత ఒక గ్లాసు లెమన్ వాటర్ తాగితే సరిపోతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR