Home Health నిమ్మ ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

నిమ్మ ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

అనేక పోషకాలు నిండి ఉండే నిమ్మకాయలు ఆరోగ్యానికి,అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది నిత్యం నిమ్మకాయ తీసుకుంటూ ఉంటారు.. అయితే నిమ్మకాయలు కాదు నిమ్మ ఆకులు కూడా మనకు ఎంతో మంచి చేస్తాయని మీకు తెలుసా? నిజమే నిమ్మ కాయలు కాదు నిమ్మ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయట. మరి నిమ్మ ఆకులతో ఏఏ ఉపయోగాలు అనేది ఇప్పుడు చూద్దాం.

health benefits of lemon leaves->నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బీ1, ఫ్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి.

->నిమ్మ ఆకులని వేడినీటిలో మరగబెట్టి పుక్కలిస్తే నోటిలో బ్యాక్టిరీయా ఉంటే పోతుంది. చేతులకి క్రిములు ఉన్నాయి అని మీరు భావిస్తే లేత నిమ్మ ఆకులని చేతులతో నలపండి బ్యాక్టిరీయా పోతుంది.

->తాజా నిమ్మ ఆకులు ఓ మూడు తీసుకోండి వాటిని వేడి నీటిలో నానబెట్టి ఆ నీరు తాగండి నిద్రలేమి సమస్య ఉండదు.

->నిమ్మ ఆకుల్ని నలిపి ఆ వాసన పీలిస్తే మంచిది వికారం వాంతులు అనిపిస్తే తగ్గుతుంది.

->నిమ్మ ఆకులు నూరి పళ్లు తోముకున్నా మంచిదే

->నోటిలో ఉన్న బ్యాక్టిరీయా పోతుంది అయితే వారానికి ఓరోజు మాత్రమే ఇలా చేయండి.

->స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకుల్ని వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యం బావుంటుంది.

->ఇక ఒక గ్లాస్ వాట‌ర్‌లో మూడు లేదా నాలుగు నిమ్మ ఆకుల‌ను వేసి బాగా మ‌రిగించి వ‌డ‌గ‌ట్టుకోవాలి.ఈ వాట‌ర్‌ను గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి. ఈ వాట‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

->అలాగే మైగ్రేన్‌ తలనొప్పితో ఇబ్బంది ప‌డే వారు.ఒక గ్లాస్ వాట‌ర్‌లో నాలుగు, ఐదు ఆకుల‌ను వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి. ఉద‌యాన్నే ఆ నీటిని తాగాలి.ఇలా చేస్తే మైగ్రేన్ మాత్ర‌మే కాదు. నిద్రలేమి సమస్య, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

->మచ్చలు, మొటిమలను పోగొట్ట‌డంలోనూ నిమ్మ ఆకులు తోడ్ప‌డ‌తాయి. నిమ్మ ఆకుల‌ను పేస్ట్ చేసి కొద్దిగా తేనె క‌లిపి ముఖానికి రాస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

 

Exit mobile version