మెంతి కూర వలన చలి కాలంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కూరలు ఉచితంగా లభిస్తూంటాయి. వాటిలో ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వ్యయం తక్కువ, పోషకాలు ఎక్కువ ఉండే వీటిని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలకూర, తోటకూర.. తదితర ఆకుకూరల్లాగే మెంతికూర ఆకుల్లోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.

Health benefits of Menthi curryమనదేశంలో మెంతులకంటే కూడా మెంతికూరను అధికంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Health benefits of Menthi curryస్త్రీలకు మెంతి కూర ఆప్తురాలు అని చెప్పాలి. వారికి అవసరమైన ఔషధ గుణాలు అన్ని మెంతికూరలో ఉన్నాయి. ఆడవారిలో ఎక్కువగా కనిపించే బాధ నడుము నొప్పి. మెంతికూర తినడం వల్ల నడుము నొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

పీరియడ్స్‌అంతేకాదు స్త్రీ పురుషుల లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. మెంతులలో కావలసినంత పీచు పదార్దాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి.

Health benefits of Menthi curryచలికాలంలో జీర్ణ సమస్యలు సహజంగానే వస్తుంటాయి. అలాంటి సమస్యలు ఉన్నవారు మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.

Health benefits of Menthi curryమెంతి ఆకులను తినడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

Health benefits of Menthi curryమెంతి ఆకులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది. ఒక టీస్పూన్ మెంతులు తీసుకుని, పౌడర్ చేసి, గోరువెచ్చని నీటితో మిక్స్ చేసి తాగాలిజ రెగ్యులర్ గా రోజుకు రెండు సార్లు తాగుతుంటే బ్లడ్ ప్రెజర్ అండర్ కంట్రోల్లో ఉంటుంది.

Health benefits of Menthi curryమెంతి ఆకుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని మీ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గడంతో ఇవి మీకు సహాయపడతాయి. అంతే కాదు ఇవి రక్త హీనతను కూడా దూరం చేస్తాయి. మెంతికూర కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి.

Health benefits of Menthi curryడయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం కొంత కష్టమవుతుంది. అలాంటప్పుడు మెంతి ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. శరీరానికి నీరు వచ్చినవారు మెంతికూరను రోజూ తింటే మంచి గుణం కనిపిస్తుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మెంతి ఆకులు ఉపయోగపడతాయి. మెంతికూరను పేస్ట్ లాగా తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయండి. ఆలా చేయడం వల్ల మీకు మృదువైన కేశాలు లభిస్తాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR