Home Health పుదీనా టీ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

పుదీనా టీ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

0

పుదీనాను.. ఔషధాల సంజీవనిగా పేర్కొంటారు. పుదీనాతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. సంవత్సరం పొడువునా లభించే పుదీనాలో ఎన్నో ఔషధాలు ఉన్నాయని.. వాటి ద్వారా జబ్బులను సులభంగా నయం చేసుకోవచ్చని అందరూ చెబుతారు కానీ ఎవరూ పాటించరు. కొందరికైతే పుదీనా వల్ల ప్రయోజనాలేంటో కూడా తెలియదు.

Health Benefits of Mint Teaపుదీనాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలూ తక్కువే. విటమిన్ ఏ, విటమిన్ సి, డీ, బీ కాంప్లెక్స్ విటమిన్లు ఈ ఆకుల్లో దండిగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. అధిక ఐరన్, పొటాషియం, మాంగనీస్ వంటి వాటివల్ల రక్తంలో హీమోగ్లోబిన్ పెరిగడంతోపాటు.. మెదడు పనితీరు బాగా మెరుగవుతుంది. పుదీనాతో టీ తయారు చేసుకొని తాగినా ఎన్నో లాభాలు.

ఉదయాన్నే కప్ఫు పుదీనా టీ ని, తాగితే దాని నుంచి శరీర పనితీరుకి అవసరం అయిన రాగి, పీచు, పొటాషియం కూడా అందుతాయి. గర్భిణులకు అవసరం అయిన ఫోలికామ్లం, ఒమేగాత్రీలు కావాల్సినంత ఇందులో ఉంటాయి. మరి వీటితో పాటు మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం.

అలర్జీని తగ్గిస్తుంది:

పుదీనా ఆకుల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు రోస్ మ్యారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ అసిడ్స్ సీజనల్ గా వచ్చే అలర్జీలను నివారిస్తుంది.

దగ్గు,జలుబును నివారిస్తుంది:

పుదీనాలో మెంతాల్ అధికంగా ఉంటుంది. మెంతాల్ డీకంజెస్టాంట్ గొంతులో గరగర వంటి ఇబ్బందులకు లోనయినప్ఫుడు కప్ఫు పుదీనా చాయ్ తాగండి. నిమిషాల్లో ఉపశమనం పొందొచ్చు.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:

రెగ్యులర్ డైట్ లో పొదీనా తీసుకోవడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి వేగవంతం చేస్తుంది. రెండు స్పూన్ల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి.

మార్నింగ్ సిక్ నెస్:

గర్భినీ స్త్రీలకు చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీల్లో ఉదయం పూట అసౌకర్యాన్ని, వికారాన్ని నివారించే సుగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

 

Exit mobile version