మిగతా ఆకుకూరలతో పోలిస్తే మునగాకుని తక్కువగా తింటాం. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరిక వదలకుండా తింటారు. పాలకూరతో పోలిస్తే ఇందులో పాతికరెట్లు ఎక్కువ ఇనుము ఉంటుంది. క్యారెట్లతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువగా విటమిన్ ఎ అందుతుంది. పాలల్లో కంటే మునగాకులో ఉండే క్యాల్షియం పదిహేడు రెట్లు అధికం. పిల్లలు తినే ఆహారంలో దీన్ని చేరిస్తే వాళ్లకు ఎముకల్లో బలం పెరుగుతుంది.
అలాంటి మునగాకు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. మునగాకు మొటిమలను తగ్గించడంలోనూ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముఖం ఎంత అందంగా ఉన్నా మొటిమలు వచ్చాయంటే అందవిహీనంగా కనబడుతారు.
ముఖం మీద మొటిమలు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొటిమలను తగ్గించే కోటానికి రకరకాల ఫేస్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం. చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అలా ఖర్చు పెట్టకుండా ఇంటి చిట్కాలతో మొటిమల నుండి బయట పడవచ్చు.
మొటిమలు అనేవి యుక్తవయసులో కాకుండా వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మొటిమలు వస్తే ఇంటి చిట్కాలు సహాయపడతాయి. మునగాకు మొటిమలను తగ్గించటమే కాకుండా ముఖం కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది. దీని కోసం ఒక ప్యాక్ తయారు చేసుకోవాలి. మునగాకు నుండి రసాన్ని తీసుకొని దానిలో నిమ్మరసం కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి పదినిమిషాలయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మూడు రోజులపాటు చేస్తే మొటిమలు మాయమైపోతాయి.
ముఖం కాంతివంతంగా మారాలి అంటే మునగాకు పేస్ట్ లో తేనె కలిపి ముఖానికి రాయాలి. బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు అన్నీ పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.