పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0
496

పుట్టగొడుగులు వాస్తవానికి శిలీంద్రాలు. శిలీంద్రాలు మొక్కలలో హానికరమైన తెగుళ్ళు కలుగాజేయడమే కాకుండా మనిషికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. అయితే ఇవి ముఖ్యంగా కుళ్లిన పదార్థాలున్న చోట ఇది పెరుగుతుంది కాబట్టి.. దీని మీద అనేక సంశయాలు కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మంచిదేనా? అనే సందేహాలు కూడా గతంలో కలిగాయి. కానీ ఇవన్నీ పక్కనపెడితే.. మంచి ఔషధ గుణాలు కలిగిన సహజసిద్ధమైన ఆహారం పుట్టగొడుగు అనడంలో సందేహం లేదు.

Health benefits of mushroomsఅనేక సంవత్సరాలు ఈ వైవిధ్యమైన ఆహారం పై ఎన్నో వైద్య పరిశోధనలు జరిగాయి. ఎన్నో పోషక విలువలు కలిగి క్రొవ్వు మరియు పిండి పద్ధారం తక్కువగా ఉండటం, ముఖ్యంగా మాంనసకృత్తులు అధికంగా ఉండటం వలన పోషక లోపముతో బాధపడుతున్న మహిళలకు, చిన్న పిల్లలకు ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇదొక ప్రత్యామ్న ఆహారంగా సూచిస్తున్నారు. పుట్టగొడుగులను చాలామంది మాంసాహారంతో సమానంగా చూస్తారు. ఇందులోని పొటాషియం పక్షవాతాన్ని నివారిస్తుందట. అలాగే కొన్ని రకాల పుట్టగొడుగులు క్యాన్సర్ ముప్పును కూడా తొలిగిస్తాయి. పుట్టగొడుగుల వల్ల ఒక రకంగా భూమి కూడా సారవంతంగా మారుతుందట. దీనికి ఉండే చనిపోయే మొక్కలను రీసైకిల్ చేసే గుణం వల్ల.. విలువైన పోషకాలు భూమిలోకి ఇంకిపోతాయట. అలాగే పుట్టగొడుగులలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుందట. చైనా, జపాన్ లాంటి దేశాలలో ఇప్పటికీ వారి సంప్రదాయ వైద్యంలో పుట్టగొడుగులది అగ్ర స్థానమే.

Health benefits of mushroomsఅటువంటి పుట్టగొడుగులను వంటలలో వాడుతారు. వర్షాకాలం వస్తే చాలు.. చాలామందికి ఇది ఫేవరెట్ ఫుడ్ కూడా. పుట్టగొడుగులలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. పుట్టగొడుగులలోని యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ ఇంకా రొమ్ము క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుందని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.

పుట్టగొడుగుల లోని ఫైబర్, పొటాషియం, గుండె ఆరోగ్య పనితీరును మెరుగుపరుస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా హృదయ సంబంధ వ్యాధులను అరికడుతుంది. అనేక అధ్యయనాలు పుట్టగొడుగులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయని తెలిపాయి. పుట్టగొడుగులలో బీటా-గ్లూకాన్స్ అధికంగా ఉంటాయి, అవి హైపోకొలెస్టమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.

Health benefits of mushroomsవివిధ రకాల ఎడిబుల్ పుట్టగొడుగులపై జరిపిన ప్రీ క్లినికల్ అధ్యయనాలు పుట్టగొడుగులు హైపోగ్లైసెమిక్ లక్షణాలను కలిగి ఉంటాయని ఇవి రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించడంలో ప్రభావంతంగా పని చేస్తాయని తెలిపాయి. ఓయెస్టర్ మష్రూమ్ వంటి కొన్ని రకాల పుట్టగొడుగులను ఐరన్ కు మంచి మూలంగా చెబుతారు. అవి రక్తహీనతను నివారించడానికి సహాయపడతాయి. అలాగే కొన్ని రకాలలో కాపర్ కూడా అధికంగా ఉంటుంది. కాపర్ శరీరం ఐరన్ను శోషించడంలో సహాయపడుతుంది అది కూడా రక్తహీనత చికిత్సకు అవసరం.

ఊబకాయం కోసం:

Health benefits of mushroomsపుట్టగొడుగులలో ఉండే ఎరిటాడెనిన్ మరియు బీటా-గ్లూకాన్లు హైపోలిపిడెమిక్ లక్షణాలు కలిగి ఉన్నట్లు ప్రీ క్లినికల్ అధ్యయనాలు సూచించాయి ఇవి ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాక బీటా-గ్లూకాన్లు కడుపు నిండిన భావనను కలిగించి తక్కువ తినేలా చేస్తాయి. అలాగే ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి.

కాన్సర్:

Health benefits of mushroomsఅనేక రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా వివిధ రకాల పుట్టగొడుగులు ప్రభావవంతంగా పని చేస్తాయని ఒక సమీక్షా వ్యాసం తెలిపింది. ప్లూరోటస్ జాతికి చెందిన పుట్టగొడుగు సారాలు పెద్దప్రేగు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిలో చేస్తాయి. అగారికస్ అనే పుట్టగొడుగు రొమ్ము క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

 

SHARE