ఒంటికి ఆయిల్ మసాజ్ చేసుకోవడం ద్వారా కలిగే లాభాలు

ఏవైనా పండగలు శుభకార్యాలు జరిగినప్పుడు అభ్యంగన స్నానం చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే స్నానానికి ముందు శరీరానికి నూనెను బాగా పట్టించి మర్దనా చేయాలి. శరీరం దృఢంగా, ఆరోగ్యగంగా కావాలంటే తైల మర్దన కావాలి దానినే అభ్యంగనం అంటారు. ఎప్పుడో ఒకసారి కాదు ప్రతిదినం ఒంటికి ఆయిల్ మసాజ్ చేసుకోవడం తప్పనిసరి అని ఆయుర్వేదం తెలియచేస్తుంది.

ఆయిల్ మసాజ్ఆయిల్ మసాజ్ అనేది ఒక రకమైన వ్యాయామం వంటిది. దీనివలన ముసలితనం త్వరగా దరిచేరదు. ఒళ్లునొప్పులు ఉండవు. కళ్ళకి తేటదనం వస్తుంది. శరీరానికి నునుపుదనం, బలం కలుగుతాయి. ఆయుష్షు పెరుగుతుంది. మంచినిద్ర పడుతుంది. శ్రమని తట్టుకొనే శక్తి పెరుగును. ప్రస్తుత జనరేషన్ లో కూడా స్పా ఇంకా వివిధ చోట్ల కూడా ఆయిల్ మసాజ్ చేయడం చూస్తూనే ఉన్నాం.

ఆయిల్ మసాజ్కానీ చాలా మందికి ఆయిల్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియవు. ఆయిల్ మసాజ్ చెడు మలినాలను తొలగించి అవసరమైన పోషణను చర్మానికి అందిస్తుంది. అంతేగాక ఆయిల్ మసాజ్ చర్మం లోపలి నుండి గ్లో ఇచ్చి చర్మాన్ని చాలా స్మూత్ గా కూడా ఇది మారుస్తుంది. ఆయిల్ చర్మానికి ఆరోగ్యకరమైన కణజాలం ఉంచడంలో చాలా బాగా సహాయ పడుతుంది.

ఆయిల్ మసాజ్ముఖం ఇంకా శరీరంలో ఉండే మొటిమలను నిరోధించడానికి కూడా ఆయిల్ మసాజ్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఆయిల్ తో మసాజ్ చెయ్యడం వల్ల సహజసిద్ధమైన గ్లో వస్తుంది. చర్మం ఎంతో అందంగా ఉంటుంది. ఆయిల్ తో బాగా మర్దన చేయడం వల్ల శరీర నొప్పులు కూడా తగ్గుతాయి.

ఆయిల్ మసాజ్రక్త ప్రసరణ బాగా ఉంటుంది. రక్త ప్రసరణ బాగా జరగడం వలన శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది. శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం తేలికగా, ఉత్సాహంగా ఉంటుంది. శరీరంలోని అన్ని జాయింట్లలో పట్టుకుపోవడం తగ్గి అన్నివైపులకు తిరగడానికి వీలుగా ఉంటుంది. మసాజ్ శరీరంలో దృఢత్వాన్ని పెంచుతుంది.

ఆయిల్ మసాజ్ఆయిల్ మసాజ్ వెన్నుముక కు చాలా మంచిది. తరుచూ ఆయిల్ మసాజ్ చేయడం వలన వెన్నుముక నుంచి వచ్చే స్పైనల్ నెర్వ్స్ కు సంబంధించిన అవయవాలన్నీ బాగా పనిచేయడానికి అవకాశం ఉంది. శరీరంలోని ఎలక్ట్రో మ్యాగ్నటిక్ శక్తి సక్రమంగా ప్రవహించడానికి మసాజ్ దోహదం చేస్తుంది.

ఆయిల్ మసాజ్ప్రతి రోజు నిద్రపోయే ముందు ఐదు నుండి పది నిముషాలు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఉదయం లేవ గానే రిలాక్స్ గా ఉండొచ్చు. ఇబ్బందులన్నీ పోయి చక్కగా, శుభ్రంగా ఉండడానికి సహాయ పడుతుంది. లేవ గానే మీరు చాలా రిలాక్స్ గా హ్యాపీ గా ఫీల్ అవుతారు. సైంటిఫిక్ ప్రకారం నూనె రాసే విధానాన్ని పిచోటి పద్ధతి అంటారు. దీని ద్వారా నెర్వస్ కనెక్షన్స్ సరిగ్గా ఆరోగ్యంగా బ్యాలెన్స్ గా ఉంటాయని చెప్తున్నారు నిపుణులు.

ఆయిల్ మసాజ్నిద్రకి ముందు కొద్దిగా ఆవ నూనె తీసుకుని పాదాలకి మసాజ్ చేయడం వలన అధిక బరువుని తగ్గించుకోవచ్చు. ఆవ నూనె తో మసాజ్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆవనూనెతో మసాజ్ చేయడం వలన చక్కగా నిద్రపడుతుంది.

ఆయిల్ మసాజ్ఇక ఎక్కువగా మసాజ్ చేయడానికి కొబ్బరి నూనె, ఆవాలు నూనె, ఆలివ్ ఆయిల్ ఇంకా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ను కూడా వాడవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ కి సంబందించిన జాస్మిన్ ఆయిల్, రోజ్ వంటివి కూడా మసాజ్ చెయ్యడానికి ఉపయోగించుకోవచ్చు. పైగా మీరు దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన పనేమి కూడా లేదు. కేవలం పది నిమిషాలు దీని కోసం టైంని వెచ్చిస్తే సరిపోతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR