ఉల్లిపాయ రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని పెద్దలు చెబుతున్న మాట. అంటే ఉల్లిగడ్డను తినడం వల్ల.. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అర్థం. అనేక ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. అందుకే.. ఉల్లిపాయలను రోజూ కూరల్లో వేసుకొని వండుకొని తింటాం. ఏ ఆహారమైనా అందులో ఉల్లిగడ్డ ఉండాల్సిందే. చిరుతిళ్లలోనూ ఊల్లిపాయ ముక్కలు ఉండాల్సిందే. ఉల్లిగడ్డ మాత్రమే కాదు.. ఉల్లిపాయ రసంలోనూ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Health Benefits Of Onion Juiceఅవును ఉల్లిపాయ రసంలో ఎన్నో విటమిన్లు ఉన్నందున ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా విటమిన్లు ఎ మరియు బి ఎక్కువ గా ఉంటాయి. అదనంగా, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు మరియు ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. అది రోగనిరోధక శక్తిని బాగా బలపరుస్తుంది. వైరస్, తామర వంటి చర్మం వ్యాధులను తొలగిస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టు వేగంగా పెరగడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Health Benefits Of Onion Juiceఉల్లిపాయ రసం కడుపు మరియు కడుపు సంబంధిత రుగ్మతలకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయల్లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపులో ఉపశమనం కలిగిస్తాయి. ఇవి దీర్ఘకాలిక మలబద్ధకం మరియు అధిక వాయువు సమస్యలను బాగా తొలగిస్తాయి. ఉల్లిపాయ రసం పెద్దప్రేగు సమస్యలకు చికిత్స చేయడానికి మరియు పిల్లలలో నులి పురుగులను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

Health Benefits Of Onion Juiceఉల్లిగడ్డలో యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వాటినే క్వెర్ సెటిన్ అని పిలుస్తారు. అది మెటబాలిజం రేటును పెంచుతుంది. దాని వల్ల.. శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు కరుగుతుంది. ఉల్లిగడ్డలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సోడియం కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే.. ఉల్లిగడ్డను ఖచ్చితంగా ప్రతి కూరలో వేసుకొని తింటారు.

Health Benefits Of Onion Juiceచాలామంది తమ పొట్టను తగ్గించుకోవాలని అనుకుంటారు. పొట్ట బాగా ఎక్కువగా ఉన్నవాళ్లు.. ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి నిత్యం తీసుకోవాలి. అలా చేస్తే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. దానికోసం.. ఉల్లిపాయ రసాన్ని ఎలా తయారు చేయాలంటే… ఉల్లిగడ్డను తీసుకొని.. ముక్కలు ముక్కలుగా చేసి.. మిక్సీలో వేసి బాగా మొత్తగా చేసి.. ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి కలపాలి. దాంట్లో కాసింత తేనె వేసి నిత్యం తాగుతూ ఉండాలి. ఈ పానీయాన్ని ఉదయమే పరగడుపున తాగాలి. దీంతో పొట్ట తగ్గుతుంది.

Health Benefits Of Onion Juiceఉల్లిపాయ రసంలో క్వెర్సెటిన్, ఆంథోసైనిన్స్ మరియు ఆర్గానోసల్ఫైడ్ వంటి అనేక యాంటికాన్సర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఉల్లిపాయ రసంలో ఉండే పాలీఫెనాల్స్ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఈ సమ్మేళనాలు అనేక రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయని పరిశోధనలో తేలింది. ఉల్లిపాయ రసంలో ఉన్న భాగాలు కణితి కణాలను నాశనం చేస్తాయి మరియు తద్వారా క్యాన్సర్ చికిత్స మరియు నివారణకు సహాయపడతాయి.

Health Benefits Of Onion Juiceఉల్లిపాయ రసం తాగడం వల్ల.. జలుబు ఉన్నా.. దగ్గు ఉన్నా.. జ్వరం వచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తపోటును సమతుల్యం చేసే ఉల్లిపాయ రసం, ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది. అందువల్ల, రక్త ప్రసరణ లోపాలు, ఆర్టిరియోస్క్లెరోసిస్స్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బ్లడ్ షుగర్ లేవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఉల్లిపాయ రసంతో తగ్గించవచ్చు.

Health Benefits Of Onion Juiceఉల్లిపాయ రసం ఋతు అవకతవకలను ఎదుర్కొంటున్న మహిళలకు ఋతు ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఋతు సమయంలో క్రమం తప్పకుండా ఉల్లిపాయ రసం తీసుకుంటే ఆ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. ఉల్లిపాయ రసం మొటిమలకు కూడా మంచి చికిత్స. మొటిమలు ఎక్కువగా ఉన్నవాళ్లు.. ఉల్లిరసాన్ని నిత్యం తీసుకోవాలి. లేదంటే తేనె గాని ఆలివ్ నూనెతో కలిపి ప్రభావిత ప్రాంతాలకు అప్లై చేసుకోవాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR