Home Health తామర గింజల వలన కలిగే ప్రయోజనాలు

తామర గింజల వలన కలిగే ప్రయోజనాలు

0

తామర పువ్వులోని గింజలనే ‘మఖానా’ అంటారు. వీటిని ఫాక్స్ నట్స్‌ అని కూడా పిలుస్తారు. గ్లూటెన్‌ ఫ్రీతో పాటు ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతారు. వీటిని కొందరు పచ్చిగానే ఉపయోగిస్తే మరికొందరు వేయించుకుని, ఉడకబెట్టుకుని కూరల్లో, స్వీట్లలో వినియోగిస్తుంటారు.

Health Benefits Of Phool Makhanaముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వీటితో మిఠాయిలు చేసి దేవునికి నైవేద్యం పెడతారు. మఖానాలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా క్యాన్సర్, డయాబెటిస్ సమస్యలు రావు. బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవడం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరియు గుండె జబ్బు సమస్యలు ఉన్నవారికి ఇవి గొప్ప అల్పాహారం గా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో మంచి కొవ్వు నిల్వలు ఉంటాయి అవి కూడా తక్కువ పరిమాణంలో సంతృప్త కొవ్వులు అవడం వలన వీటిని తీసుకుంటే బరువు తగ్గాలని అనుకునేవారు సులువుగా బరువు తగ్గుతారు.

శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఎర్ర రక్తకణాలను రీసైకిల్ చేయడం ద్వారా రక్త వ్యవస్థను సమర్థవంతంగా ఉంచడంలో దోహాధం చేస్తుంది. అలాగే ప్లీహన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ ప్రక్రియను సమర్థవంతంగా ఉంచుతూ మలబద్దకాన్ని నివారిస్తుంది.

కీళ్ల సమస్యలతో పాటు దంత సమస్యలతో బాధపడేవారు ఈ గింజలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలు, దంతాలను బలంగా మారుస్తాయి. వీటిలోని క్యాల్షియం, ఐరన్ గర్భిణులకు ఎంతో సహకరిస్తాయి. వారిలో రక్తహీనత సమస్య రాకుండా చేస్తాయి. మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. అంటే అవి రక్తంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. గోధుమ లో ఉన్న గ్లూటెన్ కొందరికి ఒంటదు. అలాంటి వారు ప్రత్యమ్నాయంగా వీటిని తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ కావాల్సిన మోతాదులో పొందవచ్చు. శరీరంలో మంటను తగ్గించే కెంప్పెరోల్ వీటిలో సహజంగా లభ్యమవుతుంది.

కేవలం ఆరోగ్యాన్నే కాదు మఖానాతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మొటిమలు, ముడతలు రాకుండా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున వీటిలో గొప్ప యాంటీ ఏజింగ్ ప్రభావం ఉంటుంది. ఇది యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మం నిగారింపును, ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.

Exit mobile version