Home Health బంగాళాదుంప జ్యూస్ తాగితే ఇన్ని సమస్యలు తగ్గించుకోవచ్చు!

బంగాళాదుంప జ్యూస్ తాగితే ఇన్ని సమస్యలు తగ్గించుకోవచ్చు!

0

ప్రకృతి ఒడిలో దొరికే అమూల్య ఆహారాలలో బంగాళదుంప ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు బంగాళదుంప అంటే ఇష్టపడతారు. వీటితో అనేక రకాల వంటకాలు చేసుకుని ఆరగిస్తుంటాం. ముఖ్యంగా, ఆలూ ఫ్రై, పులుసు, టమోటా వంటి కూరలను, వివిధ రకాల చిప్స్‌ను తయారు చేసుకుని ఆరగిస్తుంటాం. అయితే కేవలం వంటలతోనే కాకుండా, ఆలూ జ్యూస్‌తో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

బంగాళదుంప జ్యూస్బంగాళదుంప జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు సమస్య ఉన్నవారు బంగాళదుంప జ్యూస్ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ కరుగుతుంది. అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు దాంతో బరువు ఈజీగా తగ్గుతారు.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో తగినంత రోగ నిరోధకశక్తి ఉండాల్సిన అవసరం ఉంది. గుండె సమస్యలు రాకుండా సహాయపడుతుంది గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. చర్మం యవ్వనంగా కాంతివంతంగా ఉండటమే కాకుండా ముడతలను తగ్గిస్తుంది.

బంగాళాదుంపల జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. ఆలుగడ్డల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలకు సపోర్ట్‌ను ఇస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఆలుగడ్డ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఈ జ్యూస్‌ను తాగితే కీళ్ల నొప్పులు పోతాయి. డయాబెటిక్ పేషెంట్లకు పొటాటో జ్యూస్ ఎంతో మంచిది. బ్లడ్ లో షుగర్ లెవల్ తగ్గడానికి ఇది ఉపకరిస్తుంది.

గుండె వ్యాధులు మరియు స్ట్రోక్స్ తగ్గించటానికి, నిరోధించటానికి బంగాళాదుంప రసం చాలా ఉత్తమమైనది. ఇది ధమని అవరోదాలను, క్యాన్సర్, గుండె మరియు కణితులు తగ్గిస్తుందని నమ్ముతారు. గాస్ట్రిక్, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధి, కాలేయ వ్యాధి, రక్తపోటు మరియు సోర్ భుజాల వంటి అనేక ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి, ప్రతి రోజు ఒకటి లేదా రెండు గ్లాసుల బంగాళాదుంప రసం త్రాగండి.

బంగాళాదుంపల జ్యూస్‌తో మైగ్రేన్‌ నొప్పికి మటుమాయమై పోతుంది. అలాగే, జీర్ణాశయం, పేగుల్లో ఏర్పడే అల్సర్లను నివారిస్తుంది. ఈ జ్యూస్‌లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్య నుంచి ఉపశమనాన్నిస్తుంది. ఆలుగడ్డలై విటమిన్ “సి” ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది. రక్తహీనత సమస్య పోతుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు పోతాయి.

కాలేయం మరియు పిత్తాశయంలో ఉన్న చెడును బంగాళాదుంపరసం ఒక డిటాక్స్ ఏజెంట్ లాగా పనిచేసి,బయటకు నెట్టివేస్తుంది. జపనీస్ హెపటైటిస్ చికిత్సకు బంగాళాదుంప రసాన్ని ఉపయోగిస్తారు. ఇందులో శరీరానికి రోజువారీగా కావల్సిన “బి” విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

ఆలూ రసాన్ని నియమిత రూపంలో తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా అంతం అవుతాయి. ఇది మీ చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. పోషకాలను అందిస్తుంది. మెరుపును ఇస్తుంది. మొటిమలు తగ్గడానికి కూడా ఉపకరిస్తుంది. అయితే బంగాళదుంప జ్యూస్ మంచిది కదా అని ప్రతి రోజు తాగకూడదు. వారంలో రెండు సార్లు తాగితే సరిపోతుంది. కడుపు నొప్పి సమస్య ఉన్నవారు బంగాళదుంప జ్యూస్ కి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ జ్యూస్ వలన కడుపునొప్పి పెరిగే అవకాశం ఉంది.

ఇక జుట్టు పెరుగుదల వేగవంతంగా కావాలంటే బంగాళాదుంపరసంతో రెగ్యులర్ గా మాస్క్ వేసుకోండి. ఒక బంగాళాదుంప తీసుకొని దాని పై తొక్కను తీసేసి, ముక్కలుగా కట్ చేసుకోని మెత్తగా అయ్యేవరకు రుబ్బండి. దాని నుండి రసం పిండేసి ఒక చిన్న మొత్తంలో తేనె మరియు ఒక గుడ్డు తెల్లసొనను దీనితో కలపండి. మీ జుట్టుకు ఈ మిశ్రమాన్ని పట్టించి రెండు గంటలపాటు అలానే వదిలేయండి. ఆ తరువాత ఒక తేలికపాటి షాంపూ సహాయంతో కడిగివేయండి. జుట్టుకు పోషణ లభిస్తుంది. పెరుగుదల బాగుంటుంది.

 

Exit mobile version