రాగులను ఇలా తీసుకోవడం వలన ఊబకాయం సమస్య తగ్గిపోతుంది

గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడం వల్ల.. ఊబకాయం అనేది ఈ జనరేషన్ లో సర్వసాధారణం అయిపోయింది. దాన్నే స్థూలకాయం అంటారు. పొట్ట చుట్టూ అనవసర కొవ్వు పేరుకుపోవడం వల్ల.. అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో ఒబెసిటీ సమస్య వస్తోంది. ఒకసారి ఊబకాయం సమస్య వచ్చిందంటే.. ఇక ఇతర రోగాలు కూడా క్యూ కట్టినట్టే. గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు కూడా ఊబకాయం వల్ల వస్తుంటాయి.

రాగులఅందుకే అందరూ ఊబకాయాన్ని వేగంగా తగ్గించుకోవాలని కోరుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఫ్యాట్‌ను తగ్గించుకోవాలని కోరుకుంటారు. దాని కోసం శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించాలి. కసరత్తులు చేయాలి. ఎన్నింటినో త్యాగం చేయాలి. అయితే.. కొందరు ఎంత చేసినా కూడా అస్సలు బరువు తగ్గరు. ఎంత కష్టపడి కసరత్తులు చేసినా అస్సలు బరువు తగ్గరు. అయితే.. అటువంటి వాళ్లు బరువు తగ్గడానికి శారీరక వ్యాయామాలతోపాటు.. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

రాగులబరువు తగ్గడానికి రాగులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఫింగర్ మిల్లెట్స్ వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. భారతదేశంలో మరియు ఆఫ్రికాలో తినే అత్యంత సాధారణ మరియు పురాతనమైన తృణధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు రాగులు ఓ ప్రధానమైన ఆహారం. రాగి సంకటి (ఆంధ్రప్రదేశ్), రాగి ముద్ద (కర్ణాటక) ఇలా దక్షిణభారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రాగి రొట్టె ఆహారాలు ప్రధాన ఆహారం కూడా అంతెందుకు ఆహారంపట్ల శ్రద్ధ వహించే నేటితరంలో కూడా రాగిపిండి చాలా ప్రసిద్ధిని పొందింది. రాగులతో గంజి, రాగి రొట్టె మరియు ఇతర వేపుడు పదార్ధాలను చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. ‘మిల్క్ షేక్స్’ మరియు ఐస్ క్రీమ్ లకు వాటిని మరింత పోషకమైనవి మరియు ఆరోగ్యకరమైన తినుబండారాలుగా చేయడానికి రాగిపిండిని కలుపుతారు.

రాగులఎందుకంటే రాగిలో సున్నా శాతం కొలెస్ట్రాల్, సోడియం ఉన్నాయి. కొవ్వు 7 శాతం మాత్రమే ఉంది. వీటితోపాటు.. కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు లాంటివి రాగుల్లో పుష్కలంగా దాగున్నాయి. వీటిని రోజూ ఆహారంలో చేర్చడం ద్వారా మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతోపాటు.. బరువు కూడా సులువుగా నియంత్రించుకోవచ్చు. అయితే.. రాగుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

రాగులరాగిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తిన్న తరువాత కడుపు చాలా సేపు నిండి ఉంటుంది. ఆకలి వేయదు. దీని కారణంగా అతిగా తినడాన్ని అరికట్టడంతోపాటు.. శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే బరువు తగ్గడానికి రాగులు ఉత్తమమని పేర్కొంటున్నారు. బరువు తగ్గడానికి చేసే వ్యాయామంతో పాటుగా.. రాగులను కూడా ఎక్కువగా తీసుకోవాలి. రాగులలో అస్సలు కొలెస్టరాలే ఉండదు. రాగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు.. బరువు కూడా వేగంగా తగ్గుతారు.

రాగులరాగుల్లో ఎక్కువగా కాల్షియం ఉండటం వల్ల.. ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి. ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 100 గ్రాముల రాగుల్లో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చితే.. ఎముకలను బలంగా మార్చడంతోపాటు.. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే.. రాగుల్లో సోడియం కూడా ఉండదు. దీంట్లో ఎక్కువగా మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. అవే శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.

రాగులరాగుల్లో కొలెస్ట్రాల్, సోడియం లేకుండా.. ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగులు తినడం ద్వారా కొలెస్ట్రాల్, బిపిని తగ్గించుకోవచ్చు. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల.. రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చడం ద్వారా రక్తం హీనత సమస్య తగ్గుతుంది.

రాగులడయాబెటిక్ రోగులు.. అల్పాహారం, భోజనంలో రాగులను చేర్చితే.. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం కూడా తక్కువ. అయితే రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు.. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారు తినకూడదు. థైరాయిడ్ రోగులు కూడా రాగులను తినకపోతే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాగులఉదయం అల్పాహార సమయంలో.. మొలకెత్తిన రాగులను తినవచ్చు. దీంతోపాటు రాగి జావను తాగవచ్చు. రాగి పిండితో ఇడ్లీలు, దోశలను తయారు చేసుకొని తినవచ్చు. దీంతోపాటు పలు రకాల వంటలు చేసుకొని తినవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR