వర్షపు నీటిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా

వర్షాకాలం వచ్చిందంటే వర్షపు నీటిని నిల్వ చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. పల్లెల్లో అయితే ఈ నీటిని తాగడానికి కూడా ఉపయోగిస్తుంటారు. కానీ కొంతమందిలో అసలు వర్షపు నీటిని తాగొచ్చా అనే అనుమానాలు ఉన్నాయి. వర్షపు నీటిలో ఆసిడ్స్ ఉంటాయని అవి తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయనే అపోహలూ ఉన్నాయి. నిజానికి ఈ నీరు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైందట. సైంటిస్టులు చేసిన అధ్యయనాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

Health Benefits Of Rain Waterసాధారణంగా వాననీరు స్వచ్ఛమైనదే. మేఘాల్లో ఉన్న నీటి ఆవిరే ద్రవీభవించి వర్షపు బిందువులుగా పడడమే వానకు అర్థం. కాబట్టి వర్షపు నీరు శుభ్రమైన జలమే. అయితే వాయు కాలుష్య కారకాలైన గంధక ఆక్సైడ్లు, నత్రజని ఆక్సైడ్‌లు గాలిలో ఉన్నట్లయితే వర్షపు నీటిలో ఆ వాయువులు బాగా కరగడం వల్ల ఆ వర్షపు బిందువులకు ఆసిడ్ గుణం వచ్చే అవకాశం ఉంది.

Health Benefits Of Rain Waterఅయితే వర్షపు నీటిని నేరుగా పట్టుకోవాలి. అది కూడా శుభ్రమైన పాత్రల్లో పట్టుకుని నిల్వ చేసుకోవాలి. అలా నిల్వ చేసుకున్న నీటిని తాగవచ్చు. పరిశ్రమల ప్రాంతంలోను, మురికిగా ఉండే నగర రోడ్ల పరిసరాల్లోను ఇలాంటి ఆమ్ల ఆక్సైడ్‌లు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చోట్ల వర్షపు నీటిని తాగడం శ్రేయస్కరం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే వాతావరణ కాలుష్యం లేని ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు తాగడం వల్ల ప్రమాదం లేదు.

Health Benefits Of Rain Waterవర్షపు నీటిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇవి ఆల్కలైన్ వాటర్ గా పనిచేస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో వ్యర్ధాలు అన్ని బయటికి పోయి అంతర్గతంగా శుభ్రంగా ఉంటుంది. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేసి కణాలు సురక్షితంగా ఉండేలా చేస్తుంది.

Health Benefits Of Rain Waterఉదయం సమయంలో పరగడుపున రెండు లేదా మూడు టీ స్పూన్లల వర్షపు నీటిని తాగితే జీర్ణాశయంలో పీహెచ్ స్థాయి లు మెరుగుపడి అల్సర్ వంటి సమస్యలు ఉండవు. వ‌ర్ష‌పు నీటితో త‌ల స్థాన్నం చేయ‌డం వ‌ల‌న జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. దుమ్ము , దూళి తోల‌గిపోతాయి. చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి .ఈ నీటితో బ‌ట్ట‌లు ఉత‌క‌డం వ‌ల‌న బ‌ట్ట‌లు తేల్ల‌గా మేరుస్తాయి.

Health Benefits Of Rain Waterఅయితే వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఇంటి పై క‌ప్పు బాగంనుంచే క్రిందికి వ‌చ్చే నీటిని బ‌కెట్ల‌ల‌లో ప‌డ‌తారు. అలా ప‌ట్టిన వాటిని మాత్రం తాగ‌కూడ‌దు. ఈ నీరు ప‌రిశుభ్రం గా ఉండ‌వు కాబ‌ట్టి. బ‌హిరంగ ప్ర‌దేశం అంటే ఇంటి బ‌య‌ట మేఘాల నుండి వ‌స్తున్న వ‌ర్ష‌పు నీటిని నేరుగా సేక‌రించి వేడి చేసి తాగాలి. వాటిలో ఏమైనా సూక్ష్మక్రిములు ఉంటే వేడి చేసినప్పుడు నశిస్తాయి. అప్పుడే మ‌న‌ ఆరోగ్యంకు ఎటువంటి హ‌ని క‌లుగ‌దు.

Health Benefits Of Rain Waterఈ వ‌ర్ష‌పు నీటిని ప‌ల్లే ప్రాంతాల వారు ఎక్కువ‌గా తాగ‌వ‌చ్చు. ఎందుకంటే పల్లెల్లో ప్ర‌కృతి ప‌చ్చ‌ద‌నం . మంచి వాతావ‌ర‌ణం ఉంటుంది. అదే సిటీలో అయితే వర్షపు తాగకపోవడమే మంచిది. కార‌ణం ఎక్కువ పోల్యూష‌న్ ఉండ‌టం వ‌ల‌న ఈ వ‌ర్ష‌పు నీరు క‌లుషితం అవుతుంది. కాబ‌ట్టి త్రాగ‌డానికి పనికి రాదు. కాలుష్యం లేని చోట ప‌డిన వ‌ర్ష‌పు నీటిని సేక‌రించిటి తాగ‌వ‌చ్చు.

అంతేకాదు మామూలుగా కూడా వర్షపు నీటిలో మనకు అవసరమైన లవణాలు ఉండవు. కాబట్టి వర్షం నుండి శుద్ధ జలం మన దాహాన్ని, శరీరంలో నీటి నిల్వను తీర్చుతుంది. కానీ తాగునీటి ద్వారా వచ్చే లవణ సదుపాయాన్ని వర్షపు నీరు ఇవ్వదు. మనం తాగే నీటిలా రుచిగా ఉండదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR