అరటి కాయను ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

ఆరోగ్యం అందించే పండ్లలో సామాన్యుడికి అందుబాటులో ఉండేవి అరటి పండ్లేే. అన్నీ కాలాల్లో దొరికే అరటి పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక పోష‌క విలువ‌లు ఉన్నాయి. ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించ‌వ‌చ్చు అని వైద్యులు చెబుతున్నారు. కేవలం పండు మాత్రమే కాదు అరటికాయ కూడా ఒంటికి ఎంతో మేలు చేస్తుంది.

Health Benefits Of Raw Bananasఅరటి ఆకులో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంబంధిత వ్యాధులు దగ్గరకి కూడా రావు. సాధారణంగా అరటికాయలను ఉడికించి లేదా ఫ్రై చేసి తింటుంటారు. పచ్చి అరటి పండ్లతో వివిధ రకాల అరటికాయ బజ్జీ, అరటితో గ్రేవీలు, కర్రీస్‌ను కూడా తయారుచేసుకుంటుంటారు. ఉడికించినవి ఆరోగ్యానికి మరీ మంచిది. అరటి కాయను ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.

Health Benefits Of Raw Bananasఅరటికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. అరటికాయలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో మలబద్దక సమస్య ఉండదు. రోజుకు 3.6 గ్రాముల ఉడికించిన అరటికాయ తినడం వల్ల జీర్ణవ్యవస్థకు అవసరమయ్యే ఫైబర్ పొందవచ్చు.

Health Benefits Of Raw Bananasఅరటికాయల్లో విటమిన్స్, మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా మారుతాయి. అలాగే కీళ్ల నొప్పులను కూడా నివారిస్తాయి. అరటికాయలు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీనివల్ల బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Health Benefits Of Raw Bananasఅరటికాయను తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు. అరటి కాయకు పేగులను శుద్ధీకరించడం, అందులోని కొవ్వు సెల్స్‌ను నశింపజేస్తుంది. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు. అలాగే అరటికాయ తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వ‌స్తుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీంతో బరువు కూడా త‌గ్గుతారు. బరువు తగ్గాలనుకుంటే వారానికి కనీసం 2-3 సార్లు అరటికయ తినాలి.

Health Benefits Of Raw Bananasఅరటికాయలను తినడం వల్ల ఉత్సాహంగా ఉండటమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంద‌ట‌. అరటికాయలోని ఫైబర్ అజీర్తికి చెక్ పెడుతుంది. అరటికాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. ఈ మంచి బ్యాక్టీరియా తిన్న ఆహారంను తేలికగా జీర్ణమవ్వడానికి సహాయపడుతాయి. అంతేకాదు అరటికాయ విరేచనాలను తగ్గిస్తుంది. పచ్చి అరటిపండు తీసుకోవడం వల్ల అతిసారంలో త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Health Benefits Of Raw Bananasఅరటి కాయ రక్త కణాల్లోని గ్లూకోజ్‌ను పీల్చడాన్ని ఆపేస్తాయి. ఇన్సులిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. అరటి కాయలో ఉండే స్ట్రార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వచేరకుండా, ఇన్సులిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ప్లాస్మా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు అరటికాయను ఆహారంలో భాగం చేసుకోమని చెబుతారు.

Health Benefits Of Raw Bananasఉడికించిన అరటికాయలు చాలా తక్కువ కేలరీల కంటెంట్ మరియు అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటాయి. కనుక దీనిని తినడం ద్వారా మీ శరీరం కాల్షియంను బాగా గ్రహిస్తుంది. అందువల్ల, పచ్చి అరటి కూరగాయలను తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అరటి కాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థను చురుగ్గాపనిచేయడానికి, కిడ్నీలలో రక్తం ప్యూరిఫై చేయడానికి మ‌రియు మజిల్ మూమెంట్స్ ను మెరుగుపరచడానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR