ఎటువంటి రేగి పండ్లు ఆరోగ్యానికి మంచిదో తెలుసా ?

చలికాలంలో మాత్రమే పండే సీజనల్ ఫ్రూట్స్ రేగి పండ్లు. భోగి పండుగకు పిల్లలపై భోగి పండ్లుగా కూడా రేగి పండ్లనే వాడతారు. ఆ పండ్లు తినడం వల్ల శరీరానికి ఎంతో లాభం. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ పండ్లు ముందుంటాయి. వీటిల్లో విటమిన్ సి,ఏ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తొక్కతో పాటే తినాలి.

Health Benefits of Regi palluకొందరు పెద్ద రేగిపండ్లకు తొక్క తీసేసి తింటుంటారు. తొక్కతో పాటూ తినడం వల్ల కాలేయానికి చాలా మంచిది. తేన రంగులో పండిన రేగి పండ్లు మాత్రమే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం పచ్చిగా ఉండగా తినడం అతిగా తినడం మంచిది కాదు.

మైండ్ ను షార్ప్ గా ఉంచుతుంది:

Health Benefits of Regi fruitsచేతి నిండుగా రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలోకి గ్లుంటామిక్‌ ఆమ్లం ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.

జ్వరం మరియు ఫ్లూ నివారిస్తుంది:

Health Benefits of Regi fruitsరేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. తలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.

స్కిన్ ట్యాగ్స్ :

Health Benefits of Regi fruitsరేగు ఆకులను నూరి దాన్ని కురుపులు వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి.

కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

Health Benefits of Regi fruitsకాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు ప్రత్యేకంగా రేగిపండ్లతో చేసినా టానిక్‌ను ఎంచుకుంటారు.

వాతలు, పైత్యలు నివారిస్తుంది:

Health Benefits of Regi fruitsరేగుపండ్లు తినడం వలన వాతము పైత్యము కఫము తగ్గుతాయి. ఇవి కడుపులో మంటను ఉపశమింపజేయడమే కాకుండా జీర్ణశక్తిని పెంచుతాయి. మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా, మూలవ్యాధి బారిన పడకుండా కాపాడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

రోగనిరోధకశక్తిని పెంచుతుంది:

Health Benefits of Regi fruitsఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది. ఇవి విరుగుడుగా, కఫోత్సారకంగా, మూత్ర స్రావకానికి ప్రేరకంగా ఉపయోగపడుతాయి.

బరువు పెంచుతుంది:

Health Benefits of Regi fruitsఇవి బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

బ్లడ్ ఫ్యూరిఫైయర్:

Health Benefits of Regi fruitsరేగి పండు తినడంవాళ్ళ రక్తాన్ని శభ్రం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా వంటి వాటి నివారణా మందులలో దీన్ని వాడతారు.

క్యాన్సర్ నివారిణి:

Health Benefits of Regi fruitsక్యాన్సర్‌ వ్యతిరేకి, ఉపశమనకారి.

నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

Health Benefits of Regi fruitsరేగి పండ్ల విత్తనాలు కూడా అనేక ఔషధగుణాలను కలిగి ఉంటాయి. నిద్రలేమి నివారణకు విత్తనాలను వాడతారు. అజీర్తిని అరికట్టడంలో దాని వేర్లను ఉపయోగిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR