పటిక బెల్లం వలన కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు

పటిక బెల్లం అంటే ఇష్టపడని వారుండరు. భోజనం తరువాత కాస్త పటిక బెల్లం నోట్లో వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీని రుచి అంత తియ్యగా ఉంటుంది. చెక్కర యొక్క శుద్ధి చేయబడని రూపమే ఈ పటికబెల్లం. దీన్ని వంటల్లోనూ మరియు వైద్య ప్రయోజనాల కోసం వాడతారు. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వ‌ల్ల క‌లిగే అనేక రోగాల‌కు ఔషధంగా పనిచేస్తుంది.

Health Benefits Of Rock Candyపటిక బెల్లం లో ఎస్సెన్షియల్ విటమిన్స్, మినరల్స్, ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి. బీ12 అనే విటమిన్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్చెస్ నుండే లభిస్తుంది. ఆ విటమిన్ పటిక బెల్లం నుండి కూడా లభిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు, శరీరానికి అవసరమైన పోషకాలు పటికబెల్లం ఉన్నాయి. పటికబెల్లం పొడి 3 గ్రాములు, ఒక టీ స్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి రోజూ రెండు లేక మూడు పూటలు సేవిస్తూ ఉంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.

Health Benefits Of Rock Candyనోటి పుండు ఉంటే, ఏలకులతో పటిక బెల్లం కలపడం ద్వారా పేస్ట్ తయారు చేసి, ప్రతిరోజూ ఉదయం నీటితో కలిపిన ఈ పేస్ట్ త్రాగాలి. ఇలా చేయడం ద్వారా నోటి బొబ్బలు మాయమవుతాయి. భోజనం చేసిన తరువాత మౌత్ వాష్ చేసుకోకపోతే లోపల ఉండే బ్యాక్టీరియా వల్ల నోరు వాసన వస్తుంది. భోజనం తరువాత పటిక బెల్లం కొంచెం చప్పరిస్తే శ్వాస తాజాగా ఉంటుంది. నోరు కూడా ఫ్రెష్ గా ఉంటుంది.

Health Benefits Of Rock Candyపటికబెల్లం, నల్ల మిరియాలు పొడి మరియు నెయ్యితో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. గొంతు నొప్పి నివారణకు రాత్రిపూట దీన్ని తినాలి. అలాగే ఒక గిన్నెలో పటికబెల్లం పౌడర్, నల్ల మిరియాలు పొడి తీసుకొని, ఒక చెంచా గోరువెచ్చని నీటితో కలపాలి. దీన్ని తీసుకుంటే వేధించే దగ్గు తగ్గుతుంది. ఇది గొంతులో ఉన్న అదనపు శ్లేష్మం బయటకు పంపించడానికి సహాయపడుతుంది. జ్వరం వచ్చినా, గొంతులో జర్మ్స్ ఉన్నా దగ్గు వస్తుంది. పటిక బెల్లం లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ వలన ఇమ్మీడియెట్ గా దగ్గు తగ్గుతుంది. కొంచెం పటిక బెల్లం తీసుకుని నెమ్మదిగా చప్పరిస్తే దగ్గు నుండి రిలీఫ్ వస్తుంది.

Health Benefits Of Rock Candyపటికబెల్లం పొడిని, పసుపు పొడిని నిప్పుల మీద చల్లి దాని వాసన రెండు పూటలా పీలుస్తూ ఉంటే జలుబు, పడిశం వంటివి తగ్గిపోతాయి. వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రెండు లేక మూడు పూటలు తాగితే అతిగా మాట్లాడటం వలన వ‌చ్చే గొంతు బొంగురు తగ్గిపోతుంది. ఎక్కువగా వాంతులవుతున్నప్పుడు నిమ్మపండు మీద కొంచెం పటిక బెల్లంని వేసుకొని, ఆ పండుని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే వాంతులు తగ్గుతాయి.

Health Benefits Of Rock Candyపటిక బెల్లం, మంచిగంధం, కొంచెం తేనెను కలుపుకొని బాగా ఉంటలు చేసుకొని, కడిగిన బియ్యం నీటితో కలిపి తాగడం వల్ల రక్త విరేచనాలు తగ్గుతాయి. అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు త‌గ్గుతాయి. ఒకొక్కసారి అనుకోకుండా ముక్కులోంచి రక్తం వస్తుంది. దీంతో వెంటనే పటికబెల్లం కలిపిన నీటిని బాధితులకు ఇస్తే.. వెంటనే ఉపశమనం లభిస్తుంది.

Health Benefits Of Rock Candyశరీరంపై ఎక్కువ దద్దుర్లు ఉన్నట్లయితే.. పటిక బెల్లం కొంచెం, పుదీనా ఆకు రసం తీసుకొని రెండు పూటలా తీసుకోవడం వల్ల దద్దుర్లు తగ్గుతాయి. కామెర్ల వ్యాధి ఉన్నవారు.. సొరకాయని బాగా దంచి, రసం బయటకు తీసి, అందులోకి పటిక బెల్లం పొడిని వేసి కలుపుకొని తాగితే కామెర్లు తగ్గుతాయి. ఫైల్స్ తో ఇబ్బంది పడుతున్న వారు పటిక బెల్లం, తామర పువ్వు రేకులు కలిపి, ముద్దగా నూరి ఉదయం పూట మాత్రమే తినాలి. తద్వారా తగ్గుతాయి.

Health Benefits Of Rock Candyకళ్ళు ఎర్రబడినప్పుడు పటిక బెల్లాన్ని, కొంచెం నీటిలో కరిగించి, ఆ నీరుని కంటిలో వేసుకోవడం వల్ల అవి తగ్గుతాయి. పిల్లలలకు పాలు ఇచ్చే బాలింత పటిక బెల్లం కలిపిన పాలు తాగితే.. పాలు పడడంతో పాటు యాంటీ డిప్రెసెంట్ గా కూడా పని చేస్తుంది. ఇందులో తీపి తక్కువ ఉండడంతో.. తల్లికి దీని వల్ల ఎలాంటీ హానీ ఉండదు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఎనీమియ, చర్మం పాలిపోవడం, డిజ్జీనెస్, నీరసం, నిస్త్రాణ వంటి వాటితో సఫర్ అవుతారు. పటిక బెల్లం హిమోగ్లోబిన్ లెవెల్స్ పెచడమే కాదు, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ని రీజెనరేట్ చేస్తుంది కూడా. అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వ‌స్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR