ఎక్కువ ప్రోటీన్స్ ఇచ్చే సబ్జా గింజలుతో ఆరోగ్యానికి ఎంతో మేలు

వేసవి కాలం వచ్చేస్తుంది. ఒంట్లో వేడి పెరిగిపోతుంది. ఎండాకాలంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లు, షరబత్లు ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలనిపిస్తుంది. కానీ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఇంటి దగ్గరే అందుబాటులో ఉండేది సబ్జా గింజల పానీయం.

Health Benefits of Sabza nutsఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మరిపోయారు. కానీ శరీరానికి ఈజీగా పోషకాలు అందాలంటే మాత్రం కచ్చితంగా సబ్జా గింజలు తీసుకోండి అంటున్నారు నిపుణులు.

Health Benefits of Sabza nutsఎక్కువ ప్రొటీన్, తక్కువ కెలరీలున్న గింజల లిస్ట్ తీసుకుంటే వాటిలో ముందు సబ్జా గింజలే ఉంటాయి. ఇవి నానబెట్టుకుని తింటే చలువ చేయడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని తీసుకోవడం వలన పేగుల్లో సమస్యలు ఉండవు, మల బద్దకం ఉండదు, అంతేకాదు ఆకలి తొందరగా వేయదు. బరువు తగ్గుతారు.

Health Benefits of Sabza nutsనేరుగా తాగకపోయినా ఫలూదా, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, మజ్జిగ, పలు స్వీట్లలో ఈ గింజలు తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ అదుపుచేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది, ఇక షుగర్ సమస్య ఉన్న వారు వీటిని వాటర్ లో వేసి తీసుకోవచ్చు. సబ్జా గింజల్లో మినరల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని వారానికి రెండు మూడుసార్లు అయినా తీసుకోవడం మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR