సపోటా వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

తియ్యని రుచి కలిగిన సపోటా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విపరీతమైన తియ్యదనం ఉండే ఈ పండ్లు తినడానికి ఎంతో ఈజీగా ఉంటాయి. అందుకే సపోటాలంటే అందరికీ ఇష్టం. గింజలు తీసివేసి… ఈ పండ్లను సలాడ్లు, మిల్క్ షేక్‌లు, జ్యూస్‌లలో వాడుతారు. అలాగే సపోటా లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

health benefits of sapotaసపోటా లో విటమిన్ సి విటమిన్ ఎ విటమిన్ బి ఐరన్ కాపర్ సోడియం పొటాషియం ఫైబర్ మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. సపోటాల్లో సుక్రోజ్ ఎక్కువ. ఇది వెంటనే ఎనర్జీ ఇస్తుంది. సపోటాలోని టాన్నిన్ బాడీలో వేడిని పోగొట్టి చలవ చేస్తుంది. అందుకే రెగ్యులర్‌గా వీటిని తినాలి. మలబద్ధకానికి చెక్ పెట్టడంలోనూ సపోటా చక్కగా పనిచేస్తుంది.

health benefits of sapotaఅయితే సపోటాతో ఆరోగ్యప్రయోజనాలే కాదు ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. బాగా పండిన సపోట గుజ్జులో బేకింగ్ సోడా కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ముఖం మీద మృతకణాలు అన్ని తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

health benefits of sapotaసపోటా గుజ్జులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి పదిహేను నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద ముడతలు తొలగిపోతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR