ఉసిరితో ఈ చిట్కాలు పాటిస్తే అందమైన జుట్టు మీ సొంతం

0
336

జుట్టు పొడవుగా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. జుట్టు పెరగడం కోసం ఏవేవో చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటారు. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు ఏర్పడటం వంటి అనేక సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యలు కలగకుండా ఉసిరితో ఈ చిట్కాలు పాటిస్తే అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

Health Benefits of secrecyజుట్టుకి పోషణ అందించడంలో ఉసిరి ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ, దీన్ని తమ హెయిర్ కేర్ రొటీన్‌లో యాడ్ చేసుకునేవారు మాత్రం చాలా తక్కువ మందేనని చెప్పుకోవచ్చు. హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువైతె అప్పుడు హెయిర్ కేర్ గురించి ఆలోచించడం మొదలుపెడతారు. హెల్తీ ఈటింగ్ తో పాటు సరైన హెయిర్ కేర్ రొటీన్ ను పాటించడానికి ప్రయత్నిస్తారు.

Health Benefits of secrecyఆమ్లా ఆయిల్‌తో తలకి మసాజ్ చేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. ఆమ్లాలో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్, ఫైటో న్యూట్రియెంట్స్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యూలేషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. బ్లడ్ సర్క్యూలేషన్ ఇంప్రూవ్ అయితే జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సీజన్ తో పాటు పోషణ లభిస్తుంది. దాంతో, హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది.

Health Benefits of secrecyఉసిరిలో ఐరన్ తో పాటు కెరోటిన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. కొద్దిగా శీకాకాయ పొడి, ఉసిరి పొడిల ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు బాగా అంటించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి. కనీసం వారానికి ఒకసారైనా ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Health Benefits of secrecyఉసిరి కాయ తినడం వల్ల లేదా ఉసిరి రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి స్కాల్ప్ కి బాగా మర్ధన చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కొంతమందిలో అధిక చుండ్రు వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. అలాంటి వారు కొద్దిగా ఉసిరి పొడిని, రెండు టేబుల్ స్పూన్ల మెంతి పౌడర్ ను, కొద్దిగా గోరువెచ్చని నీటినితో కలిపి మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా బాగా నాననివ్వాలి. మరుసటిరోజు ఉదయం స్కాల్ప్ కు, వెంట్రుకలకు బాగా అంటించాలి. ఒక అరగంట ఆగిన తర్వాత చల్ల నీటి స్నానం చేయడం ద్వారా చుండ్రు సమస్య తగ్గుతుంది.

 

SHARE