మందారం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0
449

‘’ఆరోగ్యమే మహాభాగ్యం’’ అన్నది నానుడి. అందువల్ల మానవునికి అన్నటికంటే తానూ ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. పూర్వం వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు. అంతే కాక ఆది నుండి గ్రామీణ ప్రధాన దేశం కనుక ప్రజలు ఎక్కువగా తమ ఆరోగ్య రక్షణకై పరిసరాలలో ప్రకృతి సిద్దంగా లభించే మొక్కలపై ఆధారపడేవారు. ఇక గ్రామాల్లో… పట్టణాల్లో… కాస్తంత స్థలం ఉన్న ప్రతివారూ ఇంట్లో వేసుకునే చెట్టు మందారం. ఇందులో ముద్ద మందారం, రేఖ మందారం అనే రకాలున్నాయి. ఈ రకాలతోపాటు రంగుల్లో కూడా అనేక వ్యత్యాసం ఉంది.

health benefits of Shoeblackplantమందార కుండిలలోను, నేల పైన పెరుగుతుంది. మందార పువ్వులు, ఆకులు, వేర్లలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. మందార పూల రేకులను పేస్ట్ చేసుకుని మజ్జిగలో కలిపి రోజూ తీసుకుంటే మహిళల్లో గర్భసంచి సమస్యలు దూరమవుతాయి. ఇంకా నెలసరి సమస్యలు మటుమాయమవుతాయి. మందార పువ్వుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసుకుని కషాయంలా తీసుకుంటే నెలసరి సమయంలో ఏర్పడే పొత్తికడుపు నొప్పి, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

health benefits of Shoeblackplantకాలేయ సమస్యల నుండి ఉపశమనం కొరకు రక్త పోటు తగ్గించడానికి మందారాన్ని ఉపయోగిస్తారు.

ఆకులు, పువ్వుల తో తలపై మర్దన చేసుకుంటే ఒత్తిడి వల్ల వచ్చే తల నొప్పి తగ్గుతుంది .

health benefits of Shoeblackplantకీళ్ళ నొప్పులు, వాపులకు చికిత్స గ మందార పూలను ఉపయోగించుకోవచ్చు .

health benefits of Shoeblackplantమందార ఆకులతో తయారు చేసిన టీలో విటమిన్ సి అధికంగా లబిస్తుంది .

మందార పువ్వులను నూనెలో మరిగించి, వడ గట్టి, ఆ నూనె జుట్టుకి రాయడం వలన జుట్టు నిగనిగలాడుతుంది. చుండ్రు కూడా మటుమాయం అవుతుంది.

health benefits of Shoeblackplantఅజీర్ణానికి చెక్ పెట్టాలంటే, నోటిపూతను దూరం చేసుకోవాలంటే రోజూ ఐదు లేదా ఆరు మందార పూవు రెక్కల్ని తీసుకోవడం ఉత్తమం.

 

SHARE