బ‌చ్చ‌లి ఆకుల‌ను చ‌ర్మానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసా ?

చర్మ రక్షణ కోసం చాలా మంది కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ, న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తిలో వెళ్తే.ఎల్ల‌ప్పుడు అందంగా మెరిసిపోవ‌చ్చు. అందులోనూ ఆకు కూర‌లు ఆరోగ్యానికే కాదు సౌంద‌ర్య ప‌రంగా కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి. ఆకుకూరల్లో ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న‌ బచ్చలి ఆకుల‌ను బ‌చ్చ‌లి కూర అని కూడా పిలుస్తుంటారు.

బ‌చ్చ‌లి ఆకుల‌నుఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమమైన స్థానం ఉంది. ఇది తెలీని వాళ్లు అంటూ ఉండరు. దీనిలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బచ్చలిలో రెండు రకాలు ఉన్నాయి. తీగబచ్చలి, కాడబచ్చలి. ఎక్కువగా కాడబచ్చలి మనకి దొరుకుతుంది. తీగబచ్చలిని ఇంటి పెరట్లోకూడా పెంచుకోవచ్చు. బచ్చలి ఆహారంలో చేర్చుకోవటంవల్ల చర్మానికి కొత్త మెరుపును ఇస్తుంది. బచ్చలి కూరలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బచ్చలి కూర పప్పు, టమాట బచ్చలి, బచ్చలికూర పచ్చడి ఇలా రకరకాలుగా బచ్చలికూరను వండుకోవచ్చు.

బ‌చ్చ‌లి ఆకుల‌నుబచ్చలికూరలో కాల్సియం, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే బీటాకెరాటిన్ కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇందులో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి మంచిది. ఊపిరితిత్తులకు బచ్చలి ఎంతో మేలు చేస్తుంది.

బ‌చ్చ‌లి ఆకుల‌నుఅయితే ఈ బ‌చ్చ‌లి ఆకు చ‌ర్మాన్ని య‌వ్వనంగా మెరిపించ‌డంలోనూ, మ‌చ్చ‌ల‌ను, ముడ‌త‌ల‌ను దూరం చేయ‌డంలోనూ సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి బ‌చ్చ‌లి ఆకుల‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌చ్చ‌లి ఆకుల‌నుకొద్దిగా తులసి ఆకులు, మూడు బచ్చలి ఆకులను కలిపి గ్రైండ్‌ చేయాలి. దీంట్లో సరిపడా నీటిని జత చేసి పేస్ట్‌ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే చర్మం మీ కాంతిమంతం అవుతుంది.

బ‌చ్చ‌లి ఆకుల‌నుబ‌చ్చ‌లి ఆకుల‌ను శుభ్రంగా క్లీన్ చేసుకుని మిక్స్ వేసి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్‌లో కొద్దిగా ప‌సుపు, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. అర‌గంట పాటు ఆర‌నిచ్చి అనంత‌రం చ‌ల్ల‌టి వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా మూడు రోజుల‌కు ఒక‌సారి చేస్తే ముఖంపై ముడ‌త‌లు త‌గ్గి య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

బ‌చ్చ‌లి ఆకుల‌ను బాగా ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా తేనె వేసి కలుపుకుని ముఖానికి ప‌ట్టించాలి. ఇర‌వై లేదా ముప్పు నిమిషాల పాటు వ‌దిలేపి ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై మృత క‌ణాలు, మ‌లినాలు పోయి అందంగా మారుతుంది.

బ‌చ్చ‌లి ఆకుల‌నుబ‌చ్చ‌లి ఆకుల‌ను మెత్త‌గా నూరి ర‌సం తీసుకుని అందులో కొద్దిగా నిమ్మ ర‌సం యాడ్ చేసి దూది సాయంతో ముఖానికి అద్దాలి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి ఇలా త‌ర‌చూ చేస్తే న‌ల్ల మ‌చ్చ‌లు, మొటిమ‌లు దూరం అవుతాయి. బ‌చ్చ‌లి ఆకుల్లో విటమిన్‌ ఎ, విట‌మిన్ సి మరియు విట‌మిన్ బి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.

బ‌చ్చ‌లి ఆకుల‌నుఅలాగే బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత (నియోనియా) సమస్య తగ్గుతుంది. బచ్చలి ఆకులను రోజుకు రెండు పూటలా నమిలి మింగుతూ ఉంటే నాలుక మీద ఏర్పడే పొక్కులు తగ్గిపోతాయి. బచ్చలి ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లు తగ్గుతాయి. కాలిన మచ్చలు మాయం అవుతాయి. ఆకులలోని జిగట పదార్థం మల మద్దకాన్ని నివారిస్తుంది. బచ్చలిలో ఉండే సాఫోనిన్ అనే పదార్థం క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది. బచ్చలి కూర తినడం ద్వారా తరుచుగా వచ్చే దగ్గు, పైత్యం, అతిదాహం సమస్యలు తీరతాయి. బచ్చలికూర శరీరంలోని వేడిని తగ్గిస్తోంది. కొన్ని ఆకులు నూరి కణతకు పెడితే.. తలలోని వేడి కూడా తగ్గుతుంది.

బ‌చ్చ‌లి ఆకుల‌నుబరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. శరీరంలో కొవ్వు తగ్గడానికి బచ్చలికూర మంచి ఆహారం. బచ్చలి కూర తీసుకుంటే కీళ్లనొప్పుల సమస్యలు, పైల్స్ సమస్యలు రావు. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. మూత్రవిసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజూ బచ్చలికూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR