Home Health సుగంధీ పాల మొక్క కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

సుగంధీ పాల మొక్క కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

మనం రోడ్ల పక్కన ఎన్నో రకాల మొక్కలు చూస్తూ ఉంటాం. వాటిలో ఉన్న ఔషధగుణాలు తెలియక పిచ్చి మొక్కలుగా భావించి పీకి పారేస్తుంటాం. కానీ ఒక్కోసారి అవి ఎలా ఉపయోగపడతాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం. అలాంటి ఒక మొక్కనే సుగంధీ మొక్క. దాన్నే సుగంధి పాల మొక్క అని కూడా పిలుస్తాం. ఈ మొక్క అడవిలో విరివిగా కనిపిస్తుంది. మన ఇంటి పేరట్లోనూ ఈ మొక్కను చూడొచ్చు. వీటిని ఆకురాల్చే మొక్కలు అని కూడా పిలుస్తారు.

Health Benefits Of Sugandha Pala Vellyఆయుర్వేదంలో ఈ మొక్కకు ఉన్న ప్రాధాన్యత మరే మొక్కకు ఉండదు. ప్రతి ఆయుర్వేద మందులో సుగంధి మొక్కను ఉపయోగిస్తారు. చాలా వ్యాధుల నివారణ కోసం ఆయుర్వేద నిపుణులు ఈ మొక్కను మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఆంగ్లంలో దీన్ని ఫాల్స్ సర్సపరిల్లా అని పిలుస్తారు. ఈ ఔషధ మొక్క యొక్క బొటానికల్ పేరు హెమిడెస్మస్ ఇండికస్. దీన్ని ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తుంటారు.

సుగంధీ మొక్కకు అనేక సాధారణ పేర్లు ఉన్నాయి, బెంగాలీలో దీనిని అనంతముల్ మరియు అనటోముల్ అని పిలుస్తారు, ఇంగ్లీషులో దీనిని ఫాల్స్ సర్సపరిల్లా మరియు ఇండియన్ సర్సపరిల్లా అని పిలుస్తారు, ఉర్దూలో ఇది ఆష్బా మరియు ఆష్బా-హేమఘ్రాబీగా కూడా ప్రసిద్ది చెందింది. సంస్కృతంలో కూడా, ఈ ఔషధ మొక్కకు అనంత, అనంతముల, గోపకన్య, గోపాసుత, సరిబా, సరివా, సుగంధీ మొదలైన అనేక సాధారణ పేర్లు ఉన్నాయి.

ఎన్నో ఔషధ విలువలు ఉన్న సుగంధి మొక్కల వేర్లను ఆయుర్వేద మందు తయారీలో ఉపయోగిస్తారు. అజీర్తి సమస్యలు ఉన్నా.. రుమాటిజం ఉన్నా.. చర్మ సమస్యలు ఉన్నా.. మూత్ర వ్యాధులు ఉన్నా.. ల్యూకోరోయా ఉన్నా.. జ్వరం, వికారం, వాంతులు లాంటి సమస్యలు ఉన్నా.. పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా.. ఈ మొక్క ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులతో తగ్గిస్తారు.

ఈ మొక్క యొక్క వేర్లు మరియు వేరు యొక్క బెరడు టానిక్, ఆల్టరేటివ్, డెమల్సెంట్, డయాఫొరేటిక్, మూత్రవిసర్జన మరియు రక్త శుద్దీకరణగా పరిగణించబడుతుంది. ప్రేగు సమస్యలు, ఎలిఫాంటియాసిస్, సిఫిలిస్ చికిత్స కోసం అనేక ప్రసిద్ధ ఆయుర్వేద ఔషధాల తయారీకి వీటిని ఉపయోగిస్తారు. ఇది గర్భస్రావం, మూత్రవిసర్జన, శోథ నిరోధక మరియు వల్నరీగా కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

ఇది రక్తంలోని విషాన్ని శుభ్రపరుస్తుంది. సుగంధి మొక్క వేర్లను కట్ చేసి.. దాన్ని పేస్ట్ లా చేసి ముఖం నుదిటి మీద రాస్తే.. జ్వరం, వేడి, తలనొప్పి తగ్గుతాయట. ఈ మొక్కతో చర్మపు చికాకులు మరియు దద్దుర్ల నుండి ఉపశమనం చేస్తుంది. శరీరం మీద దురద ఉన్నా కూడా వేర్ల మిశ్రమాన్ని రుద్దుకుంటే దురద సమస్య తగ్గుతుంది.

వేర్లతో చేసిన కషాయాన్ని కూడా తాగొచ్చు. అలా చేస్తే మహిళల్లో అధిక రుతు ప్రవాహాన్ని తగ్గిస్తుంది. శిశువులలో విరేచనాలను తగ్గించడానికి తల్లి పాలతో కలిపి తాగిస్తారు. అధిక రక్తపోటు, మూర్ఛ వ్యాధులు, ఉబ్బసం, బ్రోన్కైటిస్, ఆర్థరైటిస్ మరియు రోగనిరోధక రుగ్మతలకు చికిత్స చేయడానికి మొక్కల యొక్క సారం ఉపయోగపడుతుంది.

Exit mobile version