పొద్దు తిరుగుడు విత్తనాలను నేరుగా తింటే కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా?

0
583

సాధారణంగా అందరం పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల నుంచి తయారు చేసే నూనెను వంటల కోసం వాడతాం. ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ గుండెకి మంచిదని కూడా చెబుతుంటారు వైద్యులు. అయితే ఇప్పుడు తాజాగా వింటున్న అధ్యయనాలు ప్రకారం.. నూనె కన్నా… పొద్దు తిరుగుడు విత్తనాలను నేరుగా తింటేనే మనకు ఎంతో ప్రయోజనం ఉందట.

Health Benefits of Sunflower seedsమరి పొద్దుతిరుగుడు విత్తనాలు వలన కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇపుడు తెల్సుకుందాం..శరీరానికి కావల్సిన కీలక పోషకాలను అందించడంతో పాటు.. శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగిస్తుంది.పొద్దు తిరుగుడు విత్తనాలు తినడం కారణంగా కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది.

Health Benefits of Sunflower seedsడయాబెటిస్‌ను అదుపు చేసే గుణం పొద్దు తిరుగుడు విత్తనాలకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది.పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా వీటి విత్తనాలు పనిచేస్తాయి.హైబీపీని నియంత్రణలో ఉంచడం అలానే మన శరీరంలోని రక్త సరఫరాని మెరుగు పరచడంలో పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు మేలు చేస్తాయి.

Health Benefits of Sunflower seedsమాంగనీస్ పుష్కలంగా ఉండే ఈ విత్తనాలు …ఎముకలను దృఢముగా ఉంచుతాయి. చర్మాన్ని సంరక్షించే గుణాలు పొద్దు తిరుగుడు విత్తనాల్లో పుష్కలంగా ఉండటం వలన వాటిని సౌందర్యవర్దినిగా భావిస్తున్నారు.

Health Benefits of Sunflower seedsచివరి మాట:

పొద్దుతిరుగుడు పువ్వుల నూనెను మనం వంటల్లో ఎలాగో వాడుతున్నాము.. కాని వాటి విత్తనాలలో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసాక…అవి తినకాపోతే ఎలా.. కాబట్టి , తిని చూడండి.. మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి!

SHARE